Periods: మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తాయా? దీని గురించి ఎప్పుడైనా విన్నారా?

by Vennela |
Periods: మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తాయా? దీని గురించి ఎప్పుడైనా విన్నారా?
X

దిశ, వెబ్‌డెస్క్: Periods: మగాళ్లకు పీరియడ్స్(Periods) వస్తాయా? మగాళ్లకు పీరియడ్స్ ఏంటని ఆలోచిస్తున్నారా? అమ్మాయిల వలే పురుషులు కూడా మూడ్ స్వింగ్స్, హార్మోన్ల ఇంబ్యాలెన్స్(Hormonal imbalance) అనుభవిస్తారా? అయితే అవుననే చెబుతున్నారు వైద్య నిపుణులు. మగాళ్లలో టెస్టోస్టిరాన్(testosterone) అనే హార్మోన్ల మార్పుల వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే పరిస్థితిని ఎదుర్కుంటారని నిపుణులు చెబుతున్నారు. మహిళల్లాగే చిరాకు, అలసట, మూడ్ స్వింగ్స్ వంటి పరిస్థితులు కూడా మగాళ్లు కూడా అనుభవిస్తారని నిపుణులు వివరిస్తున్నారు. ఈ మార్పులను ఇరిటేబుల్ మేల్ సిండ్రోమ్(Irritable male syndrome) లేదా మేల్ పీరియడ్స్, మ్యాన్ సాచ్యురేషన్ అంటారని సైకోథెరపిస్ట్(Psychotherapist) లు చెబుతున్నారు. అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయి..ఇందుకు గల కారణాలు ఎలా ఉంటాయో చూద్దాం.

టెస్టోస్టిరాన్(testosterone) అనే హార్మోన్ పురుషుల శారీరక, మానసిక ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే ఈ హార్మోన్ తప్పనిసరి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ టెస్టోస్టిరాన్ (testosterone)అనే హార్మోన్ హెచ్చుతగ్గులకు గురువుతుంది. దీంతో శరీరంలో మార్పులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. దీన్నే ఇరిటెబుల్ మేల్ సిండ్రోమ్(Irritable male syndrome) అంటారని అంటున్నారు. దీని లక్షణాలు అచ్చం మహిళలకు వచ్చే పీరియడ్స్ లాగానే ఉంటాయి. అయితే మహిళ పునరుత్పత్తి వ్యవస్థలో తలెత్తే మార్పుల వలే పురుషుల్లో జరగవని చెబుతున్నారు.

లక్షణాలు ఎలా ఉంటాయి?

పురుషుల్లో పీరియడ్స్(Periods) లక్షణాలు అలసట, ఆందోళన, నిరాశ, కోపం, మూడ్ స్వింగ్స్, మానసిక ఒత్తిడి, ఏకాగ్రత లేకపోవడం, చిరాకుగా ఉండటం, శక్తిలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

ఇరిటెబుల్ మేల్ సిండ్రోమ్(Irritable male syndrome) రావడానికి టెస్టోస్టిరాన్(testosterone) అనే హార్మోన్ల మార్పులే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు పురుషుల్లో జరిగినట్లు ఎలాంటి అధ్యయనాలు జరగలేదని..కానీ జంతువుల్లో ఆధారాలు ఉన్నట్లు తెలిపారు.

ప్రతిరోజూ వ్యాయామం చేసినట్లయితే ఎండార్ఫిన్లు ఉత్పత్తి(Production of endorphins) ఒత్తిడి తగ్గుతుంది. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. సరిపడా నిద్రపోవడంతోపాటు ఆకుకూరలు, చేపలు, కూరగాయలు, మిల్లెట్స్, తక్కువ కొవ్వు గల డెయిరీపదార్థాలు, ప్రొటీన్లు గల ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. శీతల పానీయాలు, చక్కెరతో కూడిన ఆహారం తీసుకోవడం తగ్గించాలి. శరీరంలో తలెత్తే మార్పుల గురించి పరిస్థితులకు తగ్గట్లుగా ప్రవర్తించాలి. మూడ్ స్వింగ్స్ (Mood swings)ను గమనించి రిలాక్స్ అయ్యేందుకు ప్రయత్నించాలి. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాలి. కోపాన్ని తగ్గించుకోవాలి.


Next Story