- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవిలో చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?
దిశ, ఫీచర్స్ : వేసవిలో చెమట పట్టడం అనేది కామన్. కానీ చాలా మంది చెమటలను చూసి కూడా భయపడిపోతుంటారు. ఏంటీ నాకు ఉన్నట్టుండి అధికంగా చెమటలు పట్టేస్తున్నాయి. ఇది అనారోగ్య సమస్యనా అని టెన్షన్ పడిపోతుంటారు. అయితే అసలు వేసవిలో చెమట రావడం అనేది ఆరోగ్యానికి మంచిదా? లేక చెడ్డదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే సమ్మర్‌లో చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు వైద్యులు. ఒక మంచి రోగనిరోధక వ్యవస్థ నేరుగా చెమటతో మంచి సంబంధం కలిగి ఉంటుంది, అందువల్ల ప్రతీవ్యక్తికి సమ్మర్‌లో తప్పని సరిగా చెమటలు పట్టాలి అంటున్నారు. చెమట పట్టిన ప్రతిసారీ మన శరీరంలో ఉన్న విషపూరిత పదార్థాలు బయటకు వెళ్లిపోతాయంట దీని వలన మన ఆరోగ్యం బాగుంటుందని, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయంట. అంతేకాకుండా, చెమట అనేది మన శరీరం నుంచి ఉప్పును తొలిగిస్తుంది. ఇది గుండెకు చాలా మంచిదంట. అలాగే చెమట వెళ్లిపోవడంతో మన మనస్సు రిఫ్రెష్‌గా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ పెరుగుతోంది. అలాగే చెమట ద్వారా మన శరీరంలో ఉండే చిన్న చిన్న రంధ్రాలు తెరుచుకొని మురికి మలినాలు, బ్లాక్ హెడ్స్, ఆయిల్, మొటిమలు లాంటి సమస్యలను దూరం చేస్తుందంట. అందువలన చెమటలు అనేవి ఆరోగ్యానికి మంచివే అంటున్నారు వైద్యులు.
అయితే కొంత మంది భయం, టెన్షన్, ఆందోళన మొదలైన స్థితిలో శరీరం కూడా చెమటలు పట్టిస్తుంది. శారీరక శ్రమ పెరిగినప్పుడు, సూర్యకాంతి పెరిగినప్పుడు, గదిలో గాలి వీచనప్పుడు, విపరీతమైన చెమటలు పట్టేస్తుంటాయి. దీంతో కొందరు నాకేదో అయిపోతుందని భయానికిలోను అవుతారు. అయితే దీని గురించి భయపడాల్సిన పని లేదు. చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.ఈ చెమట ఎలా వచ్చినా అది శరీరానికి మంచిదే, ఒక వేళ అతిగా చెమటలు వచ్చి, ఇబ్బందిగా అనిపిస్తే గ్లాస్ వాటర్ తాగాలని సూచిస్తున్నారు నిపుణులు.