భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం మంచిదేనా?

by samatah |
భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం మంచిదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది,కడుపు సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. అంతే కాకుండా, అధికంగా బరువు పెరిగిపోతున్నారు. దీంతో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అది ఏమిటంటే, అన్నం తిన్న తర్వాత వెంటనే నీరు తాగవచ్చా, రాదా అని. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే, భోజనం చేసే సమయంలో వీలైనంత వరకు చాలా తక్కువ నీరు సేవించడం ఆరోగ్యానికి మంచిదంట.

ఎందుకంటే? మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది. భోజ‌నం చేసే స‌మ‌యంలో ఎక్కువ నీరు తాగినప్పుడు జీర్ణాశయంలో విడుదలయ్యే హార్మోన్స్‌, యాసిడ్స్‌ గాఢత తగ్గిపోయి తీసుకున్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణం కాకుండా చేస్తుంది. దీంతో ఆ ఆహారం కుళ్ళి అనేక అనారోగ్యాల‌కు దారితీస్తుంది.చెడు కొలస్ట్రాలు పెరిగిపోతాయి. కడుపు ఉబ్బరం,ఎసిడిటీ, గెండెలో మంట లాంటి అనేక సమస్యలకు దారి తీయవచ్చును. అందువలన తినడానికి అరగంట ముందు, తిన్న తర్వాత అరగంటకు నీరు తాగాలంట.

Advertisement

Next Story