Parsva Sukhasana Yoga: పార్శ్వ సుఖాసన ఎలా చెయ్యాలి?

by Manoj |   ( Updated:2023-06-16 14:50:26.0  )
How to do parsva sukhasana yoga
X

దిశ, ఫిచర్స్ : How to do parsva sukhasana yoga| మొదటగా బల్లపరుపు నేలపై రిలాక్సింగ్‌గా కూర్చోవాలి. రెండు నిమిషాలు శ్వాస మీద దృష్టిపెట్టి శరీరానికి విశ్రాంతినివ్వాలి. తర్వాత రెండు చేతులను పైకి లేపాలి. చేతులు రెండు తలకు దగ్గరగా చెవులకు తాకేలా ఉండాలి. ఇప్పుడు కుడివైపు తొడలకు ఒక ఫీటు దూరంలో కుడి అరచేతిని నేలపై ఆన్చాలి. తర్వాత కుడివైపు శరీరాన్ని వాల్చుతూ ఎడమ చేతిని బలంగా పైకి లాగుతుండాలి. ఈ భంగిమలో తొడలు, పిరుదులు, నేలపైనుంచి కదలకూడదు. వెన్నుపూస నిటారుగా ఉంచాలి. తల ఎటూ తిప్పకుండా సూటిగా చూస్తూ ఓ 20 సార్లు శ్వాస బలంగా తీస్తూ వదలాలి. ఇలా రెండు చేతులతో చేయాలి.

ప్రయోజనాలు:

* మనసుకు విశ్రాంతినిస్తుంది.

* ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

* మెడ, భుజాలు, వీపుకు మంచి వ్యాయమం.

Advertisement

Next Story

Most Viewed