మల్లెపూలతో మూడ్ పెరగడం మాత్రమే కాదు.. ఆ ప్రయోజనాలు కూడా ఉన్నాయి..

by Sumithra |
మల్లెపూలతో మూడ్ పెరగడం మాత్రమే కాదు.. ఆ ప్రయోజనాలు కూడా ఉన్నాయి..
X

దిశ, ఫీచర్స్ : కొత్తగా పెళ్ళైన అబ్బాయి తన భార్యకి మల్లెపూలు తీసుకువెళ్లే సన్నివేశాలను మనం చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అలాగే నిజజీవితంలో కూడా చాలామంది భర్తలు తన భార్య కోసం మల్లెపూలు తీసుకువెళుతూ ఉంటారు. మంచి సువావసనను వెదజల్లే మల్లెపూలను పెట్టుకుంటే భార్యభర్తల మూడ్ రొమాంటిక్ గా మారిపోతుందని అంటుంటారు. దాంతో వారి శృంగార జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. అయితే ఈ మల్లెపూలతో మూడ్ సెట్ అవ్వడం మాత్రమే కాకుండా మరెన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు కొంతమంది పెద్దలు, నిపుణులు. ఇంతకీ ఆ ఉపయోగాలు ఏంటి, మల్లెపూలు తీసుకెళ్లే కల్చర్ ఎలా వచ్చింది, మల్లెలతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్నపిల్లలను మొదలుకుని, పెద్దవారి వరకు ఏ మహిళ అయినా పూలు పెట్టుకునేందుకు ఇష్టపడతారు. అయితే ముఖ్యంగా మల్లెపూలను పెట్టుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు మల్లెపూలలో ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.

ఫస్ట్ నైట్ సమయంలో మల్లెపూలు..

పెళ్లైన కొత్తజంటలకు ఫస్ట్ నైట్ చేసినప్పుడు ఎక్కువగా మల్లెపూలతో రూమ్, బెడ్ డెకరేషన్ చేస్తుంటారు. అంతే కాదు నవవధువుకు మల్లెపూలను అలంకరిస్తారు. దీని ద్వారా ఆ కొత్తదంపతుల మధ్య మంచి బంధం ఏర్పడుతుందని, దానికి మల్లెపూలు ఎంతగానో సహకరిస్తాయంటున్నారు. ఒక్కసారిగా గుప్పుమనే మల్లెపూల సువాసనతో మెదడు ప్రశాంతంగా మారుతుందంటున్నారు. దీంతో ఫస్ట్ నైట్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. అంతే కాదు దంపతుల మధ్య ఉండే సిగ్గు, భయం కూడా పోతుందట. అలాగే శృంగారం చేసేటప్పుడు శీఘ్రస్కలనం కాకుండా ఉంటుందంటున్నారు. అంతే కాదు ఆ సువాసనతో నూతన దంపతులు ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉంటారని చెబుతున్నారు. దీంతో నూతన దంపతులిద్దరికీ ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..

సామాజికంగా, సాంప్రదాయ పరంగా, ఆధ్యాత్మికంగా, మతపరంగా, ఔషధ పరంగా మల్లెపూలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. గాఢమైన ఆప్యాయతకు, ఆనందానికి, అందానికి, పొందికకు ఈ మల్లెలను చిహ్నంగా భావిస్తారు. సువాసనలు గుబాళించే మల్లెలను చనుబాలు ఇచ్చే మహిళలు పెట్టుకుంటే బిడ్డకు కావాల్సినన్ని ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయంటున్నారు నిపుణులు. మల్లెపూలతో పాల ఉత్పత్తికి దోహదపడే గాలాక్టోపోయిసిస్ స్థాయి పెరుగుతుంది. అలాగే ఈ సువాసనతో లాక్టేషనల్ అమెనోరియా కూడా పెరుగుతుందంటున్నారు నిపుణులు. అలాగే మల్లెపూల సువాసనతో తలవేడిని జుట్టుతో గ్రహించి బయటకు పంపిస్తుంది. దీంతో తల చల్లగా, ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. మల్లెలు దంపతుల బంధం బలంగా ఉండేందుకు సహకరిస్తాయి. మల్లెపూల సువాసన నిద్రలేమి సమస్యను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధిక కోపాన్ని తగ్గించే గుణం, చిరాకు పోగొట్టడం, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. పూర్వకాలంలో పురుషులు కూడా మల్లెపూలను ధరించేవారని, వారి జుట్టు అప్పట్లో పొడవుగా ఉండేదని చెబుతారు.

Advertisement

Next Story