బీరు ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. వేసవిలో ఎత్తిన బాటిల్ దించేదేలే..!

by Nagaya |   ( Updated:2024-04-05 11:45:51.0  )
బీరు ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. వేసవిలో ఎత్తిన బాటిల్ దించేదేలే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : మద్యం ప్రియులకు సుక్క వేయనిదే నిద్రపట్టదు. చలికాలం మద్యం, వేసవిలో బీరు తప్పని సరి అంటారు. అయితే బీరు బాబుల కోసం వైద్యులు ఓ శుభవార్తను మోసుకొచ్చారు. మితంగా బీరు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గుడ్ న్యూస్ అందించారు. కానీ అతిగా సేవిస్తే ప్రాణాలకు ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. వద్దు వద్దని కట్టడి చేస్తేనే సీసాలకు, సీసాలు తాగే మందుబాబులు.. మద్యం ఆరోగ్యానికి మంచిదే అంటే ఆగుతారా..? కానీ అతిని వదిలేస్తే ఏదైనా మంచిదే అని తెలుసుకోవాల్సిన రోజు వచ్చింది. మరి బీరు తాగితే ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం.

బీరులో ఆల్కహాల్ ఉంటుంది. అందువల్లే బీరు ఆరోగ్యానికి హానికరం అంటారు. ఆల్కహాల్ తాగడం వల్ల లివర్, లంగ్స్ దెబ్బతింటాయి. అందుకే మద్యం తాగొద్దని పెద్దలు, వైద్యులు హెచ్చరిస్తుంటారు. కానీ బీరును మితంగా తాగితే ఆరోగ్యమే అంటున్నారు వైద్యులు. బీరులో శరీరానికి మేలు చేసే కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. వీటిని అందించే బీరును లిమిట్‌గా తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండి హృదయ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. కిడ్నీలను రక్షించడంతోపాటు రాళ్లను కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఆయుష్షును పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయడంపాటు చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించి మంచి కొవ్వును పెంచేందుకు సాయపడుతుంది. ఇన్నీ మంచి గుణాలు ఉన్న బీరును రోజుకు ఒక గ్లాస్ తాగడం మంచిదే అంటున్నారు వైద్యులు.

Advertisement

Next Story