- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వయాగ్రా టాబ్లెట్ పుట్టుక వెనుక ఇంత చరిత్ర ఉందా ?
దిశ, ఫీచర్స్ : వయాగ్రా దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అంగస్తంభన సమస్యలు ఉన్నవారు సెక్స్ సమయంలో తన భాగస్వామిని తృప్తి పరిచేందుకు దీన్ని వేసుకుంటూ ఉంటారు. ఒకప్పటి కాలంలో ఇది ఎంతో ఫేమస్ ఐన క్యాప్సిల్. అమెరికా, బ్రిటన్ దేశాలలో 1998లో ఇది మార్కెట్లలోకి దిగుమతి అయ్యింది. అంగస్తంభన సమస్యకు చెక్ పెట్టేందుకు అర్హత పొందింది.
ఎలా పుట్టింది..
పూర్వం మెర్తిల్ ట్విడ్ ఫిల్ అనే ఓ పారిశ్రామిక పట్టణం బ్రిటన్ లోని సౌత్ వేల్స్ లో ఉండేది. ఆ పారిశ్రామిక పట్టణంలో ఉన్న ఉక్కు పరిశ్రమ మూతపడి అక్కడ పనిచేసే కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. తినడానికి తిండి లేక అలమటించారు. వారి ఆర్ధిక పరిస్థితులు వారిని క్లినికల్ గినీ పిగ్స్ గా మార్చి వయాగ్రా పుట్టేదేందుకు కారణం అయ్యింది.
బీపీకి చెక్ పెట్టేందుకు ఫైజర్ సంస్థ సిల్డెనాఫిల్ 1990 ప్రారంభంలో యుకె-92, 480 అనే ఒక పిల్ ను ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే కొంతమంది నిరుద్యోగులను పనిలో చేర్చుకుని డబ్బులు చెల్లించారట. 1992లో క్లినికల్ ట్రయల్స్ కి వచ్చిన యువకులకు రోజుకు మూడు సార్లు చొప్పున పది రోజులు యుకె-92, 480 క్యాప్సిల్స్ ని వేసుకోవాలని తెలిపారట.
ఈ క్లినికల్ ట్రయల్స్ లో యువకుల్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్ లు కూడా కనిపించాయి. దీంతో పాటు మామూలు సమయంలో లాగా కాకుండా అంగస్తంభన ఎక్కువగా ఉన్నట్టు వాళ్లు వైద్యులకు తెలిపారు. అంగం ఇంతకు ముందు కన్నా ఎక్కువగా గట్టి పడినట్లు చెప్పారట. దీన్ని గమనించిన ఫైజర్ సంస్థ నపుంసకత్వం పైన కూడా రీసెర్చ్ చేసేందుకు అగుడు ముందుకేసిందట. 1994లో స్వాంజీలో నెక్స్ట్ లెవల్ క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు అంగస్తంభన సమస్య ఉన్నవారికి పరీక్షలు నిర్వహించిందట. ఈ ట్రయల్స్ లో ఫైజర్ సంస్థకు అనుకున్న ఫలితాలు కనిపించాయి.
1998 మార్చి 27న ఎఫ్.డీ.ఏ అప్రూవల్ పొందిన వయాగ్రా అంగస్తంభన సమస్యకు చెక్ పెడుతుందని అమెరికా, బ్రిటన్ లో మార్కెట్లలోకి వచ్చేసింది. 1998 లో మార్కెట్ లోకి వచ్చిన పిల్ 2008 వరకు 200 కోట్ల డాలర్ల వార్షిక విక్రయాలతో చరిత్ర సృష్టించింది. 1995 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 15 కోట్ల మంది పురుషులు అంగస్తంభన సమస్యలు ఎదుర్కొన్నారని. 2025 వరకు 32 కోట్లకు వీరి సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.