వేసవిలో పచ్చి మామిడికాయలు తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

by samatah |   ( Updated:2023-04-03 07:25:05.0  )
వేసవిలో పచ్చి మామిడికాయలు తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : వేసవి వచ్చింది అనగానే అందరికీ ముందుగా గుర్తువచ్చేది మామిడి పండ్లు. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ మామిడి పండ్లు, పడ్లుగా ఉన్న సమయంలోనే కాకుండా పచ్చిమామిడి కాయలుగా ఉన్న సమయంలో తినడం వలనక కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

పచ్చి మామిడికాయల్లో విటమిన్ ఎ, బీ6, సి, కె ఫుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ సీజన్‌లో మామిడి కాయలు తినడం వలన శరీరానికి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, డైటరీ, ఫైబర్‌లు లభిస్తాయి. అంతే కాకుండా పచ్చి మామిడికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువలన వేసవి సీజన్‌లో పచ్చి మామిడికాయలు తినడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు వైద్యులు. అంతేకాకుండా పచ్చి మామిడికాయ శరీరంలో వేడిని తగ్గించి లోపలి నుంచి చల్లదనాన్ని అందిస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి: వేసవిలో బీర్లు తాగితే నిజంగానే శరీరం చల్లబడుతుందా?

Advertisement

Next Story