డయాబెటిక్ పేషెంట్స్ .. కొబ్బరి నీళ్లు తాగొచ్చా..?.. తాగితే జరిగేది ఇదే!

by Prasanna |
డయాబెటిక్ పేషెంట్స్ .. కొబ్బరి నీళ్లు తాగొచ్చా..?..   తాగితే జరిగేది ఇదే!
X

దిశ, ఫీచర్స్: కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు అంటుంటారు. ఎందుకంటే ఇది సహజసిద్ధమైన పానీయం. కూల్ డ్రింక్స్ కంటే ఇది చాలా మంచిది. కొబ్బరి బొండాలు నగరాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా బాగా తాగుతుంటారు . అంతే కాకుండా, బీచ్ వెకేషన్‌లో ఈ పానీయాన్ని వినియోగిస్తారు. లేత, ముదురు కొబ్బరి నీరు రెండూ మనల్ని హైడ్రేట్ చేసి తక్షణ శక్తిని ఇస్తుంది. లేత కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీ శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.

అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా కొబ్బరి నీళ్లు తాగవచ్చా? లేదన్న సందేహం చాలా మందికి ఉంటుంది. కొబ్బరి నీళ్లలో సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తాగడానికి భయపడుతుంటారు. అయితే షుగర్ పేషంట్స్ కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

మధుమేహ వ్యాధిగ్రస్తులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా?

మధుమేహ వ్యాధిగ్రస్తులు కొబ్బరినీళ్లు తాగవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ నేచురల్ డ్రింక్ ను రోజూ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉన్నందున, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలోని మెగ్నీషియం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటి లోపాన్ని దూరం చేయడంతోపాటు అద్భుతమైన శక్తిని కూడా అందిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed