- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Duddilla Sridhar Babu :మాది చేతల ప్రభుత్వం
దిశ, మేడిపల్లి : తమది మాటల ప్రభుత్వం కాదని, ఏదైనా చేసి చూపుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu)అన్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ (Boduppal Municipal Corporation)లోని పలు డివిజన్లలో సుమారు 7 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్, విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ అజయ్ యాదవ్, కాంగ్రెస్ ఇన్చార్జి వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ రూ.పదివేల కోట్లు కేటాయించి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా చేయలేని ఎన్నో అభివృద్ధి పనులు 10 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందని అన్నారు. బోడుప్పల్ లో ప్రధాన సమస్యలు ఇక్కడి నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని, అందులో ప్రధాన సమస్య వక్స్ బోర్డ్, ఎస్సీ ల్యాండ్ సమస్య అని వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఎస్సీ ల్యాండ్ సమస్య కోర్టు పరిధిలో ఉన్నందున న్యాయ సలహాలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వక్స్ బోర్డ్ సమస్యను కూడా ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారం చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం నిజమైన పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే దిశగా అడుగులు వేసిందని అన్నారు. కుల గణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బోడుప్పల్ లో ఎస్ఎన్డీపీ పనులలో జాప్యం జరిగిందని, త్వరలోనే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని అన్నారు. ఉచిత బస్ ప్రయాణం కోసం ఆర్ టీ సీ సంస్థకి రూ.300 కోట్లు (300 crores)ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. బోడుప్పల్ లో జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ముఖ్య మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. మూసీ సుందరీకరణ అంటే అక్కడ పరీవాహక ప్రజల ఘోషతో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అని, భయంకరమైన దుర్వాసన నుంచి ప్రజలకు శాశ్వత పరిష్కారం చేయాలని ఆలోచన తప్ప పేద ప్రజలను ఇబ్బంది పెట్టాలని కాదని అన్నారు.
పేదవారికి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని, కానీ బీ ఆర్ ఎస్ నాయకులు ప్రతి అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, బోడుప్పల్ మేయర్ అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 17వ డివిజన్ కార్పొరేటర్ పోగుల నర్సింహారెడ్డి, 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, 3వ డివిజన్ కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, 1వ డివిజన్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.