Sunita Williams: స్పేస్ నుంచి భారత్ ఎలా కన్పించిందంటే?

by Shamantha N |
Sunita Williams: స్పేస్ నుంచి భారత్ ఎలా కన్పించిందంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: సుదీర్ఘ కాలం స్పేస్ లో ఉండి వచ్చిన భారత సంతతికి చెందిన సునితా విలియమ్స్ (Sunita Williams) బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ కలిసి నాసా (NASA) నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అంతరిక్షంలో తమ అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా స్పేస్ నుంచి భారత్(India) ఎలా కన్పించిందని మీడియా అడిగి ప్రశ్నకు సునితా బదులిచ్చారు. ముఖ్యంగా హిమాలయాల గురించి ప్రస్తావించారు. ‘‘ అమేజింగ్ జస్ట్ అమేజింగ్.. మేం హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతిసారి.. ఆ మంచు కొండల అందాలను బుచ్‌ విల్మోర్‌ కెమెరాలో బంధించారు. తూర్పు వైపు నుంచి గుజరాత్, ముంబై వంటి ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు.. తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు మాకు సిగ్నల్‌లాగా పనిచేసేవి. ఇక మొత్తంగా భారత్‌ నాకు ఎలా కన్పించిందంటే.. పెద్ద నగరాల నుంచి లైట్ల నెట్‌వర్క్‌ చిన్న నగరాల మీదుగా వెళ్తున్నట్లు కన్పించేది. ఇక హిమాలయాలైతే అత్యద్భుతం’’ అని సునితా చెప్పుకొచ్చారు.

త్వరలోనే వస్తా..

అంతేకాకుండా, త్వరలోనే భారత్‌కు వచ్చే అవకాశం ఉందన్నారు. తన జన్మించిన దేశానికి త్వరలోనే తిరిగివెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారు. భారత్ లోని బంధువులు, ప్రజలతో మాట్లాడాలని అనుకుంటున్నట్లు వివరించారు. అంతరిక్షంలోని తన అనుభవాలను వారితో పంచుకోవాలని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. భారత్‌ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమని చెప్పుకొచ్చారు. అంతరిక్ష యాత్రల్లో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న గొప్ప దేశమని కొనియాడారు. తనలోనూ భారత్ మూలాలు ఉండటం గర్వంగా ఉందన్నారు. ఇకపోతే, భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్‌ పాండ్యా, స్లొవీన్‌ అమెరికన్‌ ఉర్సులైన్‌ బోనీలకు 1965 సెప్టెంబర్‌ 19న ఒహాయోలో సునితా జన్మించారు. పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. సునీత చిన్న కుమార్తె. దీపక్‌ పాండ్యా గుజరాత్‌లో జన్మించారు.

Next Story

Most Viewed