- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈడీ, సీబీఐలను బీజేపీ మోర్చాలలో కలుపుకోండి.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: ఈడీలకు, మోడీలకు కాంగ్రెస్ భయపడదని, ఈడీ, సీబీఐలను బీజేపీ అనుబంధ సంస్థలుగా మార్చేస్తున్నారని, రాజకీయ కక్షసాధింపు కోసమే రాహుల్, సోనియాపై కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (Congress MLC Balmoor Venkat) ఆరోపించారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయం (Hyderabad ED Office) దగ్గర టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ఆయన.. ప్రజలకిచ్చిన హామీలను, బీజేపీ ఎప్పుడో మరిచిపోయిందని, విభజన, విధ్వేషం, విధ్వసంపైనే శ్రద్ధ పెడుతున్నదని దుయ్యబట్టారు. ఒకవైపు జనాభా దమశా ప్రకారం రిజర్వేషన్ల కోసం రాహుల్ ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు బీసీ కుల గణనతో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామనే ఆందోళనతో కేసులు పెడుతున్నారని విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం బిల్లు తేవడంతో కమలంలో కలవరం మొదలైందని, ఇందుకే హెరాల్డ్ కేసు (National Herald)లో రాజకీయ కక్షతోనే కేసులు, ఈడీ దాడులు (ED Raids) చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ మోడల్ పాలన (Telangana Model Governance)ను కేంద్రం జీర్ణించుకోలేకపోతోందని, గుజరాత్ మీటింగ్ (Gujarat Meeting) తర్వాత కేంద్రంలో మరింత ఆందోళన పెరిగిందని అన్నారు. అంబేద్కర్ కి నిజమైన వారసుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) అని తెలిపారు. బీజేపీ (BJP) ఈడీ (ED), సీబీఐ(CBI)లను కూడా వారి పార్టీ మోర్చలలో కలిపేస్తారేమోనని, బీజేపీ ఈడీ మోర్చ, బీజేపీ సీబీఐ మోర్చ అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.
రాజ్యాంగ వ్యవస్థలను నిర్వర్యం చేస్తున్నారని, రాజ్యంగ స్పూర్తికి విరుద్దంగా దేశంలో మోడీ పాలన సాగుతోందని మండిపడ్డారు. ఈడీ, సీబీఐలను రాజకీయ కక్షసాధింపునకు వాడుతున్నారని, దేశం మొత్తం మోడీ అరాచకపాలనను గమినిస్తున్నారని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల కుటుంబం గాంధీల కుటుంబం (Gandhi Family) అని, రాజకీయ కక్షతో వేధిస్తే.. కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోరని ఎమ్మెల్సీ వెంకట్ స్పష్టం చేశారు.