- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాడ్జెట్లతో హెల్త్ ప్రాబ్లమ్స్‌కు చెక్
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ప్రస్తుత సమాజంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగుల జీవితం. ఉద్యోగ, వ్యాపార పనులతో ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఆర్థికంగా ఉన్న వారు తమ ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఫ్యామిలీ డాక్టర్లను సంప్రదిస్తూ ఉంటారు. కానీ తాజాగా వైద్యుల సహకారం లేకుండానే స్వయంగా ఇంటి వద్దే పరీక్షలు చేసుకుంటూ జబ్బులను గుర్తించవచ్చు. వ్యాధులను ముందుగానే పసిగట్టేందుకు ప్రత్యేక వైద్య పరికరాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. మెడికల్ గాడ్జెట్లు (పరికరాలు) డాక్టర్ల మాదిరిగా ఆరోగ్యం విషయంలో రాబోయే ప్రమాదాన్ని ముందుగా హెచ్చరిస్తున్నాయి.
నిద్ర కోసం..
ప్రస్తుత జీవన విధానంతో నిద్రపోవడం పెద్ద ప్రాబ్లమ్ గా మారింది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ జాబర్స్ రాత్రి, పగలు కష్ట పడుతుంటారు. దీంతో వారిని నిద్రలేమి సమస్య బాధిస్తుంటోంది. ‘వితింగ్స్ ఔరా’ అనే స్లీపింగ్ కిట్ నిద్ర పట్టేలా చేయడంతో పాటు ఎంత గాఢంగా నిద్రపోతున్నామో లెక్కిస్తుంది. మ్యాట్‌ను పరుపు కింద పెట్టి మొబైల్‌కు అనుసంధానం చేస్తే నిద్ర వివరాలను పంపిస్తుంది. దీంతో పాటు ఉండే అలారం రంగు రంగుల కాంతులను వెదజల్లుతూ నిద్రకు కారణమయ్యే హార్మోన్లను విడుదలయ్యేలా చేస్తుంది. వీటిని ఆన్ లైన్ ద్వారా సైతం కొనుగోలు చేయవచ్చు.
శరీరంపై పుండ్లు కాకుండా..
పలు వ్యాధుల కారణంగా మంచానికి పరిమితమైన వారికి కదలిక లేక వారి శరీరంపై పుండ్లు కావడం చూస్తుంటాం. అలాంటి వారి కోసం కెనెడా పరిశోధకులు ఎలక్ట్రికల్ అండర్ ప్యాంట్స్‌ను రూపొందించారు. ఇవి ప్రతి పదినిమిషాలకు ఎలక్ట్రిక్ చార్జ్ విడుదల చేయడంతో కండరాల్లో కదలిక కలిగి రక్త ప్రసరణ జరుగుతుంది. దీంతో శరీరంపై పుండ్లు కాకుండా చూస్తుంది. దీంతో వ్యాధి తీవ్రత తగ్గే అవకాశం సైతం ఉంటుంది.
కంటిపై ఒత్తిడి తగ్గించేందుకు
ప్రస్తుతం కంప్యూటర్, సెల్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్‌ల లేనిదే పనులు కావడం కష్టం. వాటిని వినియోగించే వారి కండ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని నివారించేందుకు ‘గున్నార్ ఆఫ్టెక్స్’ అనే కంపెనీ లేత పసుపు రంగు కండ్లద్దాలను తయారు చేసింది. వీటిని పెట్టుకుంటే కంప్యూటర్ స్క్రీన్ కారణంగా కళ్లు ఒత్తిడి నుంచి పూర్తి ఉపశమనం పొందుతాయి. పైగా వీటిని ఏ ఫ్రేమ్‌లోనైనా జోడించవచ్చు. ఇది ప్రస్తుతానికి ఆన్లైన్ సైట్లలో అందుబాటులో ఉంది.
గ్లూకో ట్రాక్‌తో డయాబెటిక్ టెస్ట్
ఇన్సులిన్ ఇంజెక్షన్లతో తరచూ గ్లూకోజ్ చెకప్‌ల కోసం డయాబెటిక్ రోగులకు చేసే పరీక్షలు చేసే సందర్భంగా సూదిపోటుతో వారు ఎంతో బాధ పడుతుంటారు. దీనిని నియంత్రించేందుకు ఇజ్రాయిల్‌కు చెందిన సంస్థ ‘గ్లూకో ట్రాక్’ అనే పరికరాన్ని రూపొందించింది. చెవికి దీనిని తగిలిస్తే ఇందులో ఉండే ప్యాబ్ రక్తంలో ఉండే గ్లూకోజ్‌ను సెకన్ల వ్యవధిలో స్క్రీన్‌పై చూపిస్తుంది.
హార్ట్ బీట్ లెక్కించే స్పార్ట్ ట్రాకర్
గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే వారు ఇటీవల కాలంలో ఫిట్నెస్ మంత్రం పాటిస్తున్నారు. ఎంత దూరం నడిచాం? ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి? వంటివి తెలుసుకునేందుకు పలు యాక్టివిటీ ట్రాకర్లను ధరిస్తున్నారు. స్మార్ట్ ట్రాకర్ సైతం ఇలాంటి పరికరమే. దీన్ని బ్రేస్ లెట్, వాచ్, హ్యాండ్ బ్యాగ్, షూస్ లేసులకు సైతం తగిలించవచ్చు. గుండె పనితీరు, వైద్య సేవలు అవసరమున్నది లేనిది సైతం దీనితో తెలుసుకోవచ్చు.
‘యాంటీ స్నోర్ డివైజ్’తో గురక నుంచి విముక్తి
గురక పెట్టే వారు పక్కన పడుకునే వారికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కారణంగా పక్కనున్న వారు నిద్రలేమితో బాధపడుతుంటారు. గురకకు చెక్ పెట్టేందుకు ‘యాంటీ స్నోర్ డివైజ్’ అందుబాటులోకి వచ్చింది. కేవలం నాసికా రంద్రాల్లో వీటిని పెట్టుకుంటే చాలు అవి వ్యాకోచించి గురక రాకుండా చేస్తాయి. అమెజాన్ తదితర సైట్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇలా ఎన్నో రకాల పరికరాలు అందుబాటులోకి వచ్చినా వీటి గురించి నేటికీ చాలా మందికి తెలియకపోవడం గమనార్హం.