పనస పండు ప్రయోజనాలు..

by sudharani |   ( Updated:2020-12-07 22:50:20.0  )
పనస పండు ప్రయోజనాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: పండుల్లో అతి పెద్ద పండు పనస పండు. సువాసనలు వెదజల్లుతూ నోరూరించే పనస పండు అందరికీ ఇష్టమే. పనసలో ఆరోగ్యాన్ని పెంపోదింపజేసే పలు పోషక పదార్ధాలు అధికంగా ఉంటాయి. ఇప్పుడు అవెంటో తెలుసుకుందాం.

పనస పండులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు అధికంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ, సి తక్కువ మోతాదులో ఉంటాయి. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నిషియం పుష్కలంగా ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో డైటరీ ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దీంతో అజీర్తి, అల్సర్లను నయం చేస్తుంది.

పనస పండులో ఫైటోన్యూట్రియంట్స్, ఐసోఫ్లేవిన్స్ ఉండడం వల్ల క్యాన్సర్ నివారణకు సహయపడుతుంది. పొటాషియం అధికంగా ఉండడంతో అధిక రక్తపోటును తగ్గిస్తుంది. పనస తొనలు జ్వరం, డయారియా రుగ్మతలకు ఔషధంగా పనిచేస్తుంది. ఇక ఆస్తమాతో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని కలిగించే కణాలు త్వరగా నశించకుండా కాపాడుతుంది.

పనసలో ఉండే న్యూట్రీషియన్, విటమిన్ ఏ, ఐ విజన్ ను మెరుగుపరుస్తుంది. హెయిర్ క్వాలిటీని పెంచుతుంది. చర్మం మెరిసేలా చేస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియం, క్యాల్షియం ఉండటం వల్ల ఎముకలకు బలాన్ని చేకూర్చడానికి సహాయపడుతుంది. ఈ పండులో ఉన్న ఖనిజ లవణాలు, థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పనసలో ఉండే ఐరన్, రక్తహీనత సమస్యను నివారిస్తుంది.

పనస పండులో ఉండే సహజసిద్ధ చక్కెర్లు, ఫైబర్ ఉంటాయి. మధుమేహం రోగుల రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. అలాగే, మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది. పనస గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని తిన్నట్లయితే అజీర్తి సమస్యలు దూరమవుతాయి.

పనస పండు అంత త్వరగా జీర్ణం కాదు. కాబట్టి అమితంగా ఈ పండును తినరాదు. అనేక ప్రయోజనాలు ఇస్తుందనే ఉద్దేశంతో అతిగా తింటే కొత్త సమస్యలు తలెత్తుతాయి.

Advertisement

Next Story

Most Viewed