- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మిర్చి ఎక్కువగా తింటున్నారా..!
దిశ, వెబ్‌డెస్క్: ఘాటుగా ఉండే మిర్చిని వంటకాలలో తినటానికి చాలామంది ఇష్టపడతారు. కానీ కొంతమంది మిర్చి తినడానికి భయపడుతుంటారు. కారం ఎక్కువగా తినడం వలన బీపీ, అల్సర్ వచ్చే అవకాశం ఉందని తినడం మానేస్తారు. అయితే పచ్చిమిర్చిని తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కూరలో భాగమైన పచ్చి మిర్చిని కేవలం రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా బాగా పని చేస్తాయి. మిరపకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలను తగ్గించవచ్చు. మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్.. రక్తంలో గ్లూకోజ్ స్థాయులను అదుపులో ఉంచుతుంది. ఇది క్యాన్సర్‌కు కారణమయ్యే కణితులు, ఛాతీలో మంట వంటి అనారోగ్యాలను నిరోధించడానికి దోహదపడుతుంది.
మిర్చిలో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్‌లు చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తాయి. మిరపకాయలు వాస్తవానికి ఎండార్ఫిన్‌లను విడుదల చేయడంతో మానసిక స్థితిని పెంచుతాయి. మీరు ఇనుము లోపంతో బాధపడుతుంటే, తీసుకునే భోజనంలో మిర్చిని తీసుకోవడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. ఆకుపచ్చ మిరపకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి.
పచ్చిమిర్చిలో ఆహారపు ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఆహారాన్ని వేగంగా జీర్ణం చేసుకోవడంలో సహాయపడుతుంది. పచ్చిమిర్చి తినడం వల్ల అథెరోస్క్లెరోసిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన మిరపకాయలు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అంతేగాక మిరపకాయలలో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఒత్తిడి, ఇతర పరిస్థితులను ఎదుర్కోవడంలో తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.