హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం రూ. 6,928 కోట్లు!

by Harish |
హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం రూ. 6,928 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ. 6,928 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 5885 కోట్లతో పోలిస్తే 17.72 శాతం పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ నికర వడ్డీ ఆదాయం రూ. 15,204.06 కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 13,089 కోట్లుగా ఉండేది. అలాగే, బ్యాంక్ డిపాజిట్లు కూడా 24.3 శాతం పెరిగాయి. బ్యాంక్ నిర్వహణ ఖర్చులు రూ. 8,277 కోట్లతో క్రితం కంటే 16.3 శాతం పెరిగాయని సంస్థ ప్రకటించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణాల నాణ్యత మెరుగుపడింది. ఈ త్రైమాసికంలో స్థూల మొండి బకాయిలు 1.26 శాతం తతగ్గాయి. విలువ పరంగా..స్థూల నిరర్ధక ఆస్తులు 5.8 శాతం తగ్గి రూ. 12,650 కోట్లకు దిగజారాయి. నికర నిరర్ధక ఆస్తులు 20 శాతం క్షీణించి రూ. 3,540 కోట్లకు తగ్గాయి. క్రితం కంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొండి బకాయిల కేటాయింపు బాగా పెరిగి, రూ. 3,784 కోట్లుగా నమోదైనట్టు సంస్థ వెల్లడించింది. త్రైమాసికాల పరంగా చూస్తే కేటాయింపు 24 శాతం పెరగ్గా, వార్షిక ప్రాతిపదికన రెట్టింపు పెరిగినట్టు తెలుస్తోంది.

Tags : HDFC Bank, q4 Results, HDFC Bank profit rises,

Advertisement

Next Story

Most Viewed