హర్యానా డిప్యూటీ సీఎంకు కరోనా..

by Shamantha N |
హర్యానా డిప్యూటీ సీఎంకు కరోనా..
X

ఛండీగడ్: హర్యానా డిప్యూటీ సీఎం, జననాయక్ జనతా పార్టీ చీఫ్ దుష్యంత్ చౌతలా కరోనా బారినపడ్డారు. ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు లేకున్నా టెస్టుల్లో పాజిటివ్ వచ్చిందని, దాంతో సెల్ఫ్ ఐసొలేట్ చేసుకుంటున్నట్లు తెలిపారు.

తనతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారు తప్పకుండా టెస్టులు చేసుకోవాలని సూచించారు. అలాగే, పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ సిద్దుకూ కరోనా పాజిటివ్‌గా తేలింది. జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆయన హోం ఐసొలేషన్‌లోకి వెళ్లినట్టు చెప్పారు.

Advertisement

Next Story