- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుకు పంజాబ్ సీఎం బాధ్యత వహించాలి : ఖట్టర్
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలను కేంద్రం పట్టించుకోకపోవడంతో ఢిల్లీ వెళ్లి నిరసన తెలపాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రైతులకు సూచించారు. దీంతో వారు దేశ రాజధానిలో నిరసనలు చేపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై హర్యానా ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్టర్ స్పందించారు.
If any dangerous situation arises due to coronavirus, Punjab govt will be responsible for it. I tried to speak to Punjab CM on this matter but he denied of receiving any call. Later when I showed the proof, he was left speechless: Haryana CM Manohar Lal Khattar. https://t.co/HgpciIa9kj pic.twitter.com/GgjKUWl5iu
— ANI (@ANI) November 29, 2020
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి మళ్లీ విజృంభిస్తోందని.. ఈ సమయంలో అక్కడ నిరసన దీక్షలకు దిగిన అన్నదాతలకు ఏమైనా ఐతే అందుకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ బాధ్యత వహించాలని హర్యానా సీఎం స్పష్టంచేశారు. ఈ విషయంపై తాను ఇంతకుముందే పంజాబ్ సీఎంతో మాట్లాడటానికి ప్రయత్నించాను, కానీ అతను తన కాల్‌ను స్వీకరించలేదు. బదులుగా తనకు ఎటువంటి కాల్ రాలేదని సీఎం అమరీందర్ సింగ్ దాటవేశారు. ఆ తర్వాత నేను అతనికి కాల్ చేసిన రుజువు చూపించినప్పుడు, అతను మాట మాట్లాకుండా వెళ్లిపోయాడని హర్యానా సీఎం ఖట్టర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా, రైతుల ఆందోళనలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నిన్నటి నుంచి మాటల యుద్ధం జరుగుతోంది.