మెగా ప్రిన్స్‌కు హరీశ్‌శంకర్ గ్రీన్ చాలెంజ్

by Shyam |
మెగా ప్రిన్స్‌కు హరీశ్‌శంకర్ గ్రీన్ చాలెంజ్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు దర్శకులు హరీష్‌శంకర్. ఈ అదృష్టం కలిగించినందుకు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు గ్రీన్ చాలెంజ్‌ను తీసుకొచ్చిన ఎంపీ సంతోష్‌ను అభినందించారు హరీష్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను గ్రీన్ చాలెంజ్‌కు నామినేట్ చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్‌లో భాగస్వాములు కావాలని ప్రముఖులకు పిలుపునిచ్చారు. గద్దలకొండ గణేష్‌తో సాలిడ్ హిట్ అందుకున్న హరీష్ శంకర్… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే జూబ్లీ ఎన్‌క్లేవ్ పరిసరాల్లో అర్ధరాత్రి భారీ శబ్దాలతో భవననిర్మాణం చేపట్టడంపై హైదరాబాద్ పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులకు ట్వీట్ చేశారు హరీశ్‌శంకర్. దీంతో స్పందించిన పోలీసు యంత్రాంగం అడ్రస్ తెలుసుకుని మరీ భవన నిర్మాణ పనులను నిలిపేశారు. దీంతో ఇంత త్వరగా స్పందించిన పోలీసులకు థాంక్స్ చెప్పారు. ఈ ఘటనతో మీపై గౌరవం రెట్టింపు అయిందన్నారు హరీశ్. కొన్ని నిమిషాల్లోనే శబ్దాలు ఆగిపోయాయని, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు.. ఎప్పుడైనా రాగలరు అని నిరూపించారంటూ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. మా నమ్మకాన్ని నిలబెట్టి మా బాధ్యతను మరింత పెంచారంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story