ధాన్యం కొనుగోళ్లపై హరీష్ రావు సమీక్ష

by Shyam |   ( Updated:2020-04-04 06:50:14.0  )
ధాన్యం కొనుగోళ్లపై హరీష్ రావు సమీక్ష
X

దిశ, మెదక్: ధాన్యం కేంద్రాల ఏర్పాటు, కరోనా కేసులు నమోదుపై ఆర్థిక మంత్రి హరీష్ రావు మెదక్ కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి కోతకు ఇబ్బంది లేకుండా కోత యంత్రాలు సిద్ధం చేయాలన్నారు. 350 కోత యంత్రాలు అవసరం ఉంటాయని, అన్నింటిని జిల్లాకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రైవర్స్, మెకానిక్‎లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కరోనా నేపథ్యంలో పాత పద్ధతిలో కాకుండా ప్రత్యేకంగా ఈసారి టోకెన్ జారీ చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. కనీస ప్రమాణాలు లేని ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని మంత్రి అధికారులకు చెప్పారు. చిన్న సన్నకారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులు తమ పంటని కోయగానే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తెలియజేయాలని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

Tags: Harish Rao, review, grain purchases, medak

Advertisement

Next Story