- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రైతులకు చేసేదే నిజమైన ప్రజాసేవ’
దిశ, మెదక్: గ్రామాల్లో ఉండేది రైతులేననీ, వారికి చేసేదే నిజమైన ప్రజాసేవని మంత్రి హరీశ్ రావు గ్రామ సర్పంచ్‌లకు సూచించారు. ఆయన సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గ అధికారులు, ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నివారణకు పంట కొనుగోలు కేంద్రాల్లో నీళ్లు, సబ్బు పెట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత సర్పంచ్‌లదేననీ, దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆదేశించారు. అలాగే, టోకెన్ల పద్ధతిలో పంట కొనుగోళ్లు చేయాలని తెలిపారు. రెండు మూడు రోజుల టోకెన్లు ముందుగా ఇస్తే వర్షం పడటం, లారీలు రాకపోవడం వంటి సమస్యలతో రైతులు ఇబ్బంది పడే అవకాశముందనీ, అందుకే ఏ రోజు టోకెన్లు ఆ రోజే ఇవ్వాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో సామాజిక దూరం పాటించేలా సర్పంచ్‌తో పాటు వ్యవసాయ విస్తరణ అధికారి, ఏంపీటీసీ, రైతు బంధు సమితి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వీలైనంత వరకు చిన్న, సన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోకుండా రైతులు టార్ఫాలిన్ కవర్లు తెచ్చుకోవాలని చెప్పారు. అలాగే, వరి కోసిన రైతు ముందుగానే రిజిస్టర్ చేయించుకోవాలనీ, తేమ శాతం సరిగ్గా ఉంటే పంట పొలాల వద్దే రైతులకు టోకెన్లు ఇవ్వాలని ఆదేశించారు. బియ్యం పంపిణీ కార్యక్రమం జిల్లాలో 60 శాతం పూర్తయిందని వెల్లడించారు. గ్రామాల్లో కూరగాయలు పండించే రైతులు తాత్కాలిక మార్కెట్లలో విక్రయించుకునేలా పాసులు జారీ చేశామనీ, పాసుల కోసం వ్యవసాయ శాఖ అధికారి, తహశీల్దారు లేదా ప్రత్యేకాధికారిని సంప్రదించాలని సూచించారు. కాలిపోయిన మోటర్లను రిపేర్ చేయడానికి మండలానికో వైండింగ్ దుకాణాన్ని తెరిచి ఉంచుతామని తెలిపారు.
హరితహారంలో భాగంగా నాటిన చెట్లకు నీళ్లు పోసి కాపాడాలనీ, ఈ బాధ్యత గ్రామ సర్పంచ్‌దేనని అన్నారు. కరోనా ప్రభావంతో మందగించిన డంప్ యార్డు, స్మశాన వాటిక నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లోనూ హైపో క్లోరైడ్ స్ప్రే జరిగేలా చూడాలని హరీశ్ కోరారు.
tags:harish rao, finance minister, teleconference, gajwel,