- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ కొనసాగుతుంది: హరీష్ రావు
దిశ, మెదక్: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్నదని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాకుండా చూద్దామని మంత్రి హరీశ్ రావు అధికారులతో చెప్పారు. జిల్లా కలెక్టర్ నుంచి గ్రామస్థాయి అధికారి వరకు అప్రమత్తంగా పని చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు అధికారులు, సిబ్బంది చక్కగా పని చేశారని ఆయన కొనియాడారు. ఇదే స్ఫూర్తిని చివరి వరకు కొనసాగిద్దామని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ రోడ్ల మీదకు రావొద్దని సూచించారు. రాత్రి వేళల్లో పారిశుద్ధ్య పనులు, నిత్యావసర వస్తువులు రవాణా జరిగేలా అధికారులు పకడ్బంధీగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.
tag: harish rao, review on lockdown, comments, sangareddy