- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిస్థితి దిగజారేలా ఉంది.. వెంటనే ఇవ్వండి: హరీష్
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి ఏప్రిల్, మే నెలల్లో రావాల్సిన జీఎస్టీ పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి టి. హరీష్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఏప్రిల్, మే రెండు నెలలకు కలిపి రాష్ట్రానికి రూ.3975 కోట్లు రావాల్సి ఉందన్నారు. శుక్రవారం జరిగిన 40వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన కౌన్సిల్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా ప్రభావంతో ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రం భారీగా ఆదాయాన్ని కోల్పోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో జీఎస్టీ నష్టపరిహారం కూడా విడుదల చేయకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగులకు మూడు నెలలుగా సగం జీతాలే చెల్లిస్తున్నామని చెప్పారు. వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రమైన తెలంగాణలో అమలవతున్న ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని తెలిపారు. 2017లో జీఎస్టీ వచ్చినప్పటి నుంచి అతి కొద్ది నష్ట పరిహారం తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, నిజంగా నష్టపరిహారం అవసరమైన ఇలాంటి సమయంలో చెల్లించడానికి కేంద్రం ముందుకు రాకపోవడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి 1.76 లక్షల కోట్ల ఐజీఎస్టీ వెనక్కివ్వడంతో తెలంగాణకు రూ. 2800 కోట్లు వస్తాయని వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఒక్క 2019-20 ఆర్థిక సంవత్సరం తప్ప రాష్ట్ర జీఎస్టీ వసూళ్ల వృద్ధి ఏ సంవత్సరంలోనూ 14 శాతం కన్నా తక్కువగా లేదని వివరించారు.