దళిత బంధు ఆపింది బీజేపీనే.. మంత్రి హరీష్ షాకింగ్ కామెంట్స్

by Sridhar Babu |   ( Updated:2021-10-20 11:25:05.0  )
దళిత బంధు ఆపింది బీజేపీనే.. మంత్రి హరీష్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, జమ్మికుంట : దళిత బంధును ఆపింది ముమ్మాటికీ బీజేపీనే అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ధూమ్ ధామ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది నిజమేనని, అందువల్లనే దళిత బంధు ఆగిందని ఆరోపించారు. వీలైతే ఈ విషయాన్ని రుజువు చేస్తాను అని, ఇందుకు బీజేపీ పార్టీ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎవరు సున్నం పెట్టే వాళ్ళో, ఎవరు అన్నం పెట్టే వాళ్లో ఆలోచించాలని అన్నారు. బీజేపీ పార్టీ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెబుతూ, మన మనసులు కరాబ్ చేస్తున్నారని అన్నారు.

ప్రముఖ కవి, గాయకుడు సాయి చందు ఆట, పాటలు పలువురుని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నన్నపనేని నరేందర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story