ఈటలకు హరీష్ రావు ఛాలెంజ్.. అది నిరూపిస్తే రాజీనామా చేస్తా

by Sridhar Babu |   ( Updated:2021-10-12 09:17:41.0  )
Harish Rao
X

దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం సవాళ్లు, ప్రతి సవాళ్లకు అడ్డాగా మారింది. ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. గ్యాస్ సిలెండర్ ధరపై ఈటల రాజేందర్ ప్రజలకు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈటలకు దమ్ముంటే తాను గెలిపిస్తే సిలిండర్ ధరను రూ.వెయ్యి నుంచి రూ.500 కు తగ్గిస్తానని చెప్పాలని డిమాండ్ చేశారు. సిలిండర్ ధరలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.291 ట్యాక్స్ ఉందని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ రాష్ట్రం ప్రభుత్వం రూ.291 ట్యాక్స్ వసూలు చేస్తే ఇక్కడే నా పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు. ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అంత వసూలు చేస్తుందంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు తెలివిలేని వారు కాదని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, ఆయిల్, గ్యాస్ ధరలను రోజూ పెంచుతుందని విమర్శించారు.

Advertisement

Next Story