- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నువ్వు నాకు తెలుసు.. వ్యభిచారం చేస్తావా..?’
దిశ, క్రైమ్ బ్యూరో : నువ్వు నాకు తెలుసు.. వ్యభిచారం చేస్తావా అంటూ ఓ మహిళను వేధిస్తున్నాడో వ్యక్తి. నిత్యం మెసేజ్‌లు, కాల్స్ చేస్తూ వ్యభిచారం చేయాలని బలవంతం చేశాడు. వివాహిత అయిన ఆ మహిళకు పోలీసులను ఆశ్రయించడంతో కాముకుడి ఆటకట్టించారు పోలీసులు.
ఆదిభట్ల మున్సిపాలిటీ పటేల్ గూడకు చెందిన గడుసు నరసింహ అదే ప్రాంతానికి చెందిన వివాహితపై కన్నేశాడు. ఆమెకు తరుచూ ఫోన్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడటమే కాకుండా, మెస్సేజ్ లు పెడుతున్నాడు. వేర్వేరు నెంబర్ల నుంచి కాల్ చేస్తూ నువ్వు నాకు తెలుసు.. వ్యభిచారం చేయాలని బలవంతం చేయసాగాడు. అంతటితో ఆగకుండా మరొకరికి ఆమె నెంబరు ఇచ్చి ఫోన్లు చేయించి ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో అతడి తీరుతో విసిగిన సదరు మహిళ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ నెంబరు ఆధారంగా నిందితుడిని, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, నిందితుడు నరసింహ గతంలో అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవించినట్టుగా తెలుస్తోంది. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.