హ్యాపీ బర్త్ డే నయా వాల్.. క్రీజులో పాతుకుపో

by Shyam |
హ్యాపీ బర్త్ డే నయా వాల్.. క్రీజులో పాతుకుపో
X

ముంబయి: టీమ్ ఇండియా నయావాల్ చతేశ్వర్ పుజారా సోమవారం 33వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఆయనకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతోపాటు సహచర ఆటగాళ్లు, మాజీలు బర్త్‌ డే విషెస్ తెలుపుతున్నారు. ఇందులో భాగంగా బీసీసీఐ స్పందిస్తూ, ‘అతను క్రీజులో నిలబడి దెబ్బలను తట్టుకోగలడు. ధైర్యంగా నిలవగలడు. 81 టెస్టులు.. 6111 పరుగులు.. 18 సెంచరీలు.. ఎదుర్కొన్న బంతులు 13,572. టీమ్ ఇండియా డిపెండబుల్ ప్లేయర్ పుజారాకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు 2017లో నాగపూర్‌ వేదికగా శ్రీలంతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో 143 పరుగులు చేసిన పుజారా ఇన్నింగ్స్‌ను జత చేసింది.

హ్యాపీ బర్త్ డే పుజ్జీ. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి. క్రీజులో మరిన్ని గంటలు పాతుకుపోవాలి
– విరాట్ కోహ్లీ, టీమ్ ఇండియా కెప్టెన్.

ఆస్ట్రేలియాలో సిరీస్‌ నెగ్గడానికి ప్రధాన కారణమైన పుజారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. పరుగులు తీయడమేకాకుండా క్రీజులో వీలైనంత ఎక్కువ సమయం గడపడమూ ఎంత ముఖ్యమోనన్న విషయాన్ని ఈ తరానికి చాటి చెప్పావు. ఈ ఏడాదంతా నీకు మంచి జరగాలి.
– ఆర్పీ సింగ్, భారత జట్టు మాజీ బౌలర్

పుట్టిన రోజు శుభాకాంక్షలు పుజారా. నువ్వు మరిన్ని అద్భుతాలు చేయాలి.
– సురేశ్ రైనా, టీమ్ ఇండియా మాజీ క్రికెటర్

నిస్వార్థ ఆటగాడు పుజారాకు జన్మదిన శుభాకాంక్షలు. జట్టుకు నువ్వు అందించే సహాయాన్ని పరుగుల్లో కొలవలేం.
– సెహ్వాగ్, భారత జట్టు మాజీ ఓపెనర్

వీరితోపాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్‌ సైతం ట్విట్టర్ వేదికగా తమ శుభాకంక్షలు తెలియజేశారు. కాగా, గబ్బా టెస్టులో రిషబ్ పంత్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన పుజారా, విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ ఇన్నింగ్స్‌లో 211 బంతులు ఎదుర్కొన్న పుజారా 56 పరుగులు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed