భయాన్ని సొమ్ము చేసుకుంటున్న కంపెనీలు

by sudharani |
భయాన్ని సొమ్ము చేసుకుంటున్న కంపెనీలు
X

దిశ, వెబ్‌డెస్క్:

కోవిడ్ 19 వైరస్ ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. ఆ వ్యాధి ప్రభావం ఏమో గానీ, భయం మాత్రం అందరికీ చుక్కలు చూపిస్తోంది. ఇదే భయాన్ని క్యాష్ చేసుకోవడానికి శానిటైజర్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే 30 మి.లీ.ల హ్యాండ్ శానిటైజర్ ధరను ఎంఆర్‌పీకి 16 రెట్లు పెంచేసి రూ. 999కి ఆన్‌లైన్ మార్కెట్లో అమ్మేస్తున్నాయి.

కరోనా వైరస్ గురించి నివారణ చర్యల్లో భాగంగా చేతులను ముఖానికి తగిలించుకోవద్దని, ఎప్పటికప్పుడు హ్యాండ్ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇది విన్నవాళ్లందరూ వెంటనే హ్యాండ్ శానిటైజర్లు కొనడానికి పరిగెత్తుతున్నారు. మెడికల్ షాపుల్లో, దుకాణాల్లో శానిటైజర్లు స్టాక్ లేకపోవడంతో ఆన్‌లైన్ బాట పడుతున్నారు. కానీ ఆన్‌లైన్‌లో వాటి ధరలు చూసి కంగుతింటున్నారు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలా సమయాన్ని, భయాన్ని సొమ్ము చేసుకోవడం సబబు కాదని తయారీ సంస్థలను ఏకిపారేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము ధరలను పెంచలేదని, మధ్యలో ఉండే థర్డ్ పార్టీ సంస్థలు ఇలా ధరలు పెంచేస్తున్నాయని, దీని గురించి విచారణ జరిపి ఆ సంస్థల మీద చర్యలు తీసుకుంటామని శానిటైజర్ తయారీ సంస్థలు సమాధానమిచ్చాయి.

tags: Corona, COVID 19, Hand Sanitizer, Online sale, Flipkart, Amazon

Advertisement

Next Story

Most Viewed