- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణాలో ఒంటిపూట బడులు ఎప్పటినుండి మొదలంటే..
దిశ,వెబ్ డెస్క్: వేసవి మొదలయ్యింది.. ఎండలు మండిపోతున్నాయి.. ఇక పిల్లలందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు ఏడాది పాటు పాఠశాలకు దూరమై ఈ మధ్యనే స్కూల్ కి వస్తున్నారు. ఈలోపే ఈ ఎండ దంచికొట్టడంతో ప్రభుత్వం ఒంటిపూట బడులను ప్రారంభించడానికి సన్నద్ధమవుతోంది. ఇందుకు అనుమతిని కోరుతూ అధికారులు తమ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. సాధారణంగా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి 15 నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు.
ఈ ఏడాది కరోనా ప్రభావం కారణంగా కొన్ని నెలల నుండి విద్యార్థులు ఆన్ లైన్ క్లాసుల్లోనే పాఠాలను నేర్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే 6,7,8,9 తరగతుల విద్యార్థులు స్కూల్స్ కి రావడం ప్రారంభించారు. ఇక ఈ నేపథ్యంలో వీరికి మార్చి 22 నుండి ఒంటిపూట బడులు నిర్వహించాలని అధికారులు సిద్ధమయ్యారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలోనే క్లాసులు నిర్వహించనున్నారు. త్వరలోనే ఈ విషయమై ప్రభుత్వం తన తుదితీర్పును వెల్లడించనుంది. మార్చి 22 నుంచి ఒంటిపూట తరగతులకు అనుమతిస్తే.. దాదాపు 2 నెలలపాటు ఈ ఒంటిపూట బడులు జరుగనున్నాయి.