15నుంచి ఒంటి పూట బడులు..

by Shyam |
15నుంచి ఒంటి పూట బడులు..
X

తెలంగాణలో ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 15నుంచి ఏప్రిల్ 23వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఉదయం 8గంటల నుంచి మ.12.30వరకు విద్యార్థులకు క్లాసులు జరగాలని నిర్ణయించారు.అయితే 2019-20 అకాడమిక్ క్యాలెండర్ అలాగే కొనసాగనుండగా, ఏప్రిల్ 24నుంచి అన్నిస్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు.

Tags: half day schools, telangana, state school education board, march 15 to april 23

Advertisement

Next Story