కేటీఆర్‌ను రూ. 4.50 కోట్లు అడిగిన ఎమ్మెల్యే గువ్వల.. ఎందుకంటే..?

by Shyam |
కేటీఆర్‌ను రూ. 4.50 కోట్లు అడిగిన ఎమ్మెల్యే గువ్వల.. ఎందుకంటే..?
X

దిశ, అచ్చంపేట: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ. 9 కోట్ల నిధులు మంజూరు చేయించేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. బుధవారం రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలోనే వినతి పత్రం అందజేసి అందుకు మంత్రిని ఒప్పించినట్టు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన పక్కన ఉన్న అటవీశాఖ స్థలాన్ని కూడా మార్కెట్ నిర్మాణానికి ఇవ్వడానికి అటవీశాఖ పీసీసీఎఫ్‌కు మంత్రి స్వయంగా ఫోన్ చేశారన్నారు. మార్కెట్‌కు ఆ స్థలం ఇచ్చేలా సూచనలు చేశారని.. అందుకు అధికారులు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం రెండు వైపులా గేట్లు ఏర్పాటు చేసి, వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ కోసం ప్రత్యేకంగా సెల్లార్ నిర్మించేలా ప్రణాళికలు రూపొందిచామన్నారు. గతంలో మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ. 4.50 కోట్లు సరిపోవడం లేదని.. మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందించి.. మరో రూ. 4.50 కోట్లు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. దీంతో అదనంగా 4.50 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మొత్తం రూ. 9 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి తొందరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. మార్కెట్ నిర్మాణానికి రూ. 9 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్‌కు విప్ గువ్వల బాలరాజు ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed