- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ నేతల అరెస్ట్‌లతో ప్రజా ఆగ్రహాన్ని ఆపలేరు : గుంటుకు శ్రీనివాస్
దిశ, గజ్వేల్ : రైతు సమస్యల పట్ల ఉద్యమిస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రభుత్వం ముందస్తు అరెస్టుల పేరుతో అడ్డుకోవడం అప్రజాస్వామికమని సిద్దిపేట జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గుంటుకు శ్రీనివాస్ అన్నారు. సోమవారం ముందస్తు అరెస్టులు సందర్భంగా ఆయన మాట్లాడారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలో రైతులతో చేపట్టే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్నారు. యాసంగిలో రైతులు వరిపంట సాగు చేయకుండా వారికి ఆంక్షలు విధించడం సరికాదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాజకీయ క్రీడలు ఆడటం మానుకోవాలన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏనాడు రైతులపై ఆంక్షలు పెట్టలేదని గుర్తు చేశారు. అన్ని సీజన్లలో రైతులు తమకు ఇష్టం వచ్చిన పంటలను సాగుచేసుకున్నారని పేర్కొ్న్నారు.
వరి సాగు వద్దని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి ఇన్ని ప్రాజెక్టులు ఎందుకు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. సరైన ప్రణాళిక లేకుండా వ్యవసాయ అధికారులతో భూసార పరీక్షలు చేయకుండా ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సరఫరా చేయకుండా, రైతు అవగాహన సదస్సులు నిర్వహించకుండా ఇప్పటికిప్పుడే ప్రత్యామ్నాయ పంటలు వేయడం సాధ్యపడదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందస్తు అరెస్టులతో కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలను అడ్డుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ప్రజలంతా గమనిస్తున్నారని.. రాబోయే ఎన్నికల్లో వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి వెంకట్ గౌడ్, సీనియర్ నాయకులు నల్ల శ్రీధర్, చిటుకుల శివారెడ్డి, జమాల్‌పూర్ విఠల్, గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షుడు నక్కరాములు గౌడ్, మండల మైనార్టీ అధ్యక్షుడు అజ్గర్, కోశాధికారి నాయిని తిరుపతి, తదితరులు పాల్గోన్నారు.