- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధ్వాన్నస్థితిలో ఆ పాఠశాల.. పట్టించుకునే నాథుడే లేక శిథిలావస్థకు..
X
దిశ, గుమ్మడిదల : మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల అధ్వాన్న స్థితికి చేరుకుందా? అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. పాడుబడిన గోడలు, చెత్త చెదారంతో నిండిన తరగతి గదులు, మురికి కంపును తలపిస్తున్న మరుగుదొడ్లు, ఇలా కనీస వసతులు సైతం లేకుండా పాఠశాల అధ్వాన్న స్థితికి చేరుతోంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఇది. పాఠశాలలో నెలకొన్న వసతుల లేమి వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు .
పాఠశాలలో మొత్తం పది తరగతి గదులుండగా, నాలుగు గదులలో విద్యాబోధన చేస్తున్నారు. 30 మందికి సరిపడే ఈ గదిలో 60 మంది విద్యార్థులు కూర్చుంటున్నారు. చెత్తతో నిండిపోయిన మిగిలిన నాలుగు గదులకు మరమ్మతులు చేస్తే తరగతులు నిర్వహించవచ్చని ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి, మరుగుదొడ్లు నిర్మించాలని, ప్రహారీగోడ ఎత్తును పెంచి గేట్లు అమర్చాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
Advertisement
Next Story