మద్యం దొరక్క..

by Shyam |
మద్యం దొరక్క..
X

దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మద్యం ప్రియులకు మత్తు లేకపోవడంతో పిచ్చెక్కించేస్తోంది. మత్తు కోసం ఆరాటపడే వారికి నాటుసారా ఆసరైంది. మద్యం కోసం రోజు విలవిలాడుతున్న వారికి బెల్టుషాపుల్లో అందుబాటులో ఉన్న కొనుకోలేని దుస్థితి. ఏమి చేయలేక మద్యం ప్రియులు ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తున్నారు. ఇదే సరియైన సమయమని తండాల్లో నాటుసారా కాస్తున్నారు. లాక్ డౌన్ తో మద్యం దొరకటం లేదు. దొరికినా డబుల్, త్రిబుల్ రేట్లకు విక్రయిస్తున్నారు. అతి తక్కువకు వచ్చే నాటుసారాను తాగుతున్నారు.

నగరానికి సరఫరా…

గ్రేటర్ హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న తండాల్లో జోరుగా సారాయి కాస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా నల్లబెల్లం కొనుగోలు జరుగుతోన్నది. రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లోని పలు మండలాల్లోని తండాలో నాటుసారాను తయారు చేసి నగర్ శివారు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. దీనితో మద్యం ప్రియులకు మత్తెక్కించేసింది. గిరిజనులు లాక్ డౌన్ అందివచ్చిన అవకాశంగా మలుచుకొని నటుసారను విక్రయిస్తున్నారు. ఈ టైంను అందరూ అవకాశంగా మల్చుకుంటున్నారు. తండాల వైపు ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి చూడరనే ధీమాతో నాటుసారాను కాస్తున్నారు.

పట్టుకున్న అధికారులు…

మద్యం బదులుగా నాటుసారాను విక్రయిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకుని ఎక్సైజ్ అధికారులు మహేశ్వరం గేటు వద్ద మాటుకాసి పట్టుకున్నారు. గత 15 రోజులుగా నగరంలోని బండ్లగూడ, బడంగ్ పేట్, మీర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాలకు నాటుసారాయి రవాణా చేస్తున్నారు. మద్యం ప్రియులకు లోటులేకుండా రోజు సారాయి దొరుకుతుంది. ఆదివారం రాత్రి డిండి మండలం నుంచి హైదరాబాద్ కు సారాయి తరలిస్తున్న విషయం పోలీసులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. ఆటో ముందు బైక్ పై పోలీసులను గమనిస్తూ వస్తున్నారు. మహేశ్వరం గేటు వద్ద పోలీసులు నాటుసారా తెస్తున్న గిరిజనులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 120 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Tags: Gudumba, Hordes, Officers, Sale, Case, Rangareddy

Advertisement

Next Story