మహిళా రోగిని కిందపడేసి ఈడ్చుకెళ్లారు

by Anukaran |   ( Updated:2021-02-20 08:29:42.0  )
మహిళా రోగిని కిందపడేసి ఈడ్చుకెళ్లారు
X

దిశ,వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ భోపాల్ లో దారుణం జరిగింది. భోపాల్ లోని ఖార్గోన్ చెందిన ఓ మహిళ ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ బాధితురాల్ని కిందపడేసి ఆస్పత్రి నుంచి రోడ్డు మీదకు సుమారు 300మీటర్లు ఈడ్చూకుంటూ తీసుకెళ్లాడు. ఈ ఘటనపై స్థానికులు మండిపడ్డారు. పలువురు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఖార్గోన్ జిల్లా వైద్యశాఖ అధికారులు సెక్యూరిటీ గార్డ్ ను విధుల నుంచి తొలగించారు.
ఈ సందర్భంగా ఖార్గన్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ దివ్యేష్ వర్మ మాట్లాడుతూ బాధితురాలి మానసిక స్థితి సరిగ్గాలేదని, ఆస్పత్రి స్టాఫ్ పట్ల ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. అందుకే ఆమెను ట్రీట్మెంట్ కోసం మరో ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. బాధితురాలి పట్ల సెక్యూరిటీగార్డ్ అమానుషంగా ప్రవర్తించలేదన్నారు. ఆమెను గేటు దగ్గర ఉన్న అంబులెన్స్ లోకి నెట్టాడే తప్పా.. ఈడ్చుకెళ్లలేదని డాక్టర్ దివ్యేష్ వర్మ వెల్లడించారు.

Advertisement

Next Story