రేపు GST కౌన్సిల్ సమావేశం..

by Shamantha N |
రేపు GST కౌన్సిల్ సమావేశం..
X

దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీ పాలకమండలి సమావేశం రేపు (సోమవారం) ఢిల్లీలో జరగనుంది. కరోనా నేపథ్యంలో GST వసూళ్లు తగ్గిన విషయం తెలిసిందే. ఈ లోటును భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం అంశమే ప్రధాన అజెండాగా ఈ మీటింగ్ సాగనుంది.

పరిహారం చెల్లింపులకు సంబంధించి తగిన మార్గదర్శకాలను రూపొందించాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై వరుసగా మూడోసారి సమావేశం జరగనుండటంతో రేపు జరిగే భేటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, దీనిపై కేంద్రం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement

Next Story