- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీఎస్టీ పరిహారం రూ.36400 కోట్లు విడుదల
X
దిశ, న్యూస్‌బ్యూరో: జీఎస్టీ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం రూ.36400 కోట్లు గురువారం విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. 2019 డిసెంబర్ నెల నుంచి 2020 ఫిబ్రవరి వరకూ రాష్ట్రాలకు బకాయిపడ్డ పరిహారాన్ని విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. జీఎస్టీ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాలకు ప్రతి ఏడాది 14 శాతం కన్నా తక్కువ రెవెన్యూ వృద్ధి ఉంటే పరిహారం చెల్లిస్తామని చట్టం తీసుకొచ్చినప్పుడు కేంద్రం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిహారం కోసం కేంద్రం లగ్జరీ కార్లు, సిగరెట్లు లాంటి వస్తువుల మీద జీఎస్టీ నష్టపరిహార సెస్సు వసూలు చేస్తోంది.
Advertisement
Next Story