బెంగళూరులో మొట్టమొదటి ఎలక్ట్రిక్ బస్

by Shyam |
Electric Bus
X

దిశ, ఫీచర్స్: భవిష్యత్తులో సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ కోసం ఎలక్ట్రిక్ బస్సులు(ఈ-బస్సులు) ఉపయోగపడనున్నాయి. కాలుష్యరహితంతో పాటు డీజిల్ బస్సుల కంటే 10-20 శాతం తక్కువ నిర్వహణ ఖర్చు వీటికి సానుకూల అంశాలు. సెప్టెంబర్ 2017లో, భారతదేశంలో మొదటి కమర్షియల్ ఈ-బస్సు కార్యకలాపాలు హిమాచల్ ప్రదేశ్‌లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఈ-బస్ మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందగా.. తాజాగా బెంగళూరులో మొట్టమొదటి ఎలక్ట్రిక్ బస్‌ను కర్ణాటక రవాణా శాఖ మంత్రి గురువారం ప్రారంభించారు.

మెట్రో స్టేషన్లకు ఫీడర్ సర్వీస్‌గా సేవలందించనున్న ఈ-బస్సు.. మెట్రో ప్రయాణికులు ఎదుర్కొంటున్న లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్యలను తీర్చనుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన JBM ఆటో లిమిటెడ్ నుంచి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(BMTC)కు ఈ-బస్సు డెలివరీ అయ్యింది. 9 మీటర్ల పొడవు, 33 సీటింగ్ సామర్థ్యం గల బస్సు 45 నిమిషాల సింగిల్ చార్జ్‌తో 120 కిలోమీటర్లు ప్రయాణించగలదు. కాగా, బెంగళూరు స్మార్ట్ సిటీ స్కీమ్‌ కింద ‘నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాయుపూర్ విద్యుత్ నిగమ్’ ద్వారా రూ.130 కోట్ల విలువైన 90 ఎలక్ట్రిక్ బస్సులు రిలీజ్ అవనున్నాయని చెప్పిన ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్.. రానున్న రోజుల్లో మరో 300 బస్సులు కొనుగోలు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) ఆధారంగా నిర్వహించబడతాయి. దీని ప్రకారం ప్రైవేట్ సంస్థ బస్సులను సరఫరా చేయడమే కాకుండా నిర్వహణకు పూర్తి బాధ్యత వహిస్తుంది. అంతేకాదు డ్రైవర్లను కూడా సదరు సంస్థే అందిస్తుంది’ అని అధికారులు తెలిపారు.

ఈ-బస్సులకు పెరుగుతున్న డిమాండ్‌..
ప్రజా రవాణాను వేగంగా డీకార్బనైజేషన్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే నేషనల్ క్యాపిటల్ రీజియన్(NCR)లోని ఢిల్లీ, చుట్టుపక్కల నగరాలు 2000 సంవత్సరం ప్రారంభంలోనే డీజిల్ నుంచి తక్కువ కాలుష్యం కలిగిన కంప్రెస్డ్ సహజ వాయువు (CNG) ఇంధనానికి మారాయి. ఇక ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ(300), గోవా (150), చండీగఢ్ (80), ఉత్తర ప్రదేశ్ (700), తమిళనాడు (2,000)తో పాటు గుజరాత్‌‌లు క్రమంగా విద్యుదీకరణ వైపు దృష్టిసారిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed