- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రికి రాత్రే పొలంలో వెలిసిన సమాధులు
దిశ, పరిగి : రాత్రికి రాత్రే వ్యవసాయం పొలంలో సమాధులు వెలసిన సంఘటన పూడూరు మండలంలో కలకలం రేపింది. చంగముల్ ఎస్ఐ శ్రీశైలం, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ పొలాన్ని హైదరాబాద్ చెందిన వ్యక్తులు కొంత కాలం క్రితం కొనుగోలు చేశారు. ఆ పొలాన్ని సాగు చేసేందుకు ఇటీవలే చదును చేశారు. చదును చేసిన పొలంలో సోమవారం రాత్రికి రాత్రే రెండు సమాధులు వెలిశాయి. ఊరికి సమీపంలో పొలం ఉండటం వలన మీ భూమిలో సమాధులు వెలిశాయి అంటూ పట్టాదారుకు గ్రామస్తులు సమాచారం అందించారు.
పట్టాదారు ఫిర్యాదు మేరకు చంగముల్ ఎస్ఐ శ్రీశైలం గట్టుపల్లి పొలాన్ని పరిశీలించారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో వెలసిన సమాధులను తవ్వి చూశారు. అందులో ఎలాంటి శవాలు, వాటి తాలూకు ఏమీ లభించలేదు. ఎవరో గిట్టని వారు కావాలని ఇలా చేసి ఉంటారని గ్రామస్తులు, పోలీసులు భావించారు. ఇలాంటి పని చేసేవారు గ్రామంలో కొందరు ఉన్నారని తెలియడంతో పోలీసులు వారి వివరాలు సేకరిస్తున్నారు. అయితే రాత్రికి రాత్రే వెలిసిన సమాధుల్లో మృతదేహాలు లేకపోవడంతో భూ యజమాని ఊపిరిపీల్చుకున్నారు.