- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా ఎస్ఐ పై వాలంటీర్ బూతు పురాణం
దిశ, వెబ్‌డెస్క్: మందు పడితే చాలు కొందరికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. ఎదురుగా ఎవరున్నారు.. మనకంటే పెద్దవాళ్ల, చిన్నవాళ్ల అనే విచక్షణ కోల్పోతారు..నోటికి ఎంత వస్తే చాలు అనేస్తూనే ఉంటారు. తీరా మందు దిగాక నేనే అన్నానా.. అని మాట మారుస్తుంటారు. అలాంటిది ఓ మందు బాబు ఫూటుగా మద్యం సేవించి ఓ మహిళా ఎస్సైను ఇష్టమొచ్చినట్లు తిట్టడమే కాకుండా, ధమ్కీ కూడా ఇచ్చాడు. అతడు వృత్తి రీత్యా గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎస్ఐ రోజాలత పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. అదే సమయంలో మద్యం సేవించి ఆత్మకూరు 21వ వార్డు వాలంటీరు అటుగా వచ్చాడు. అప్రమత్తమైన పోలీసు సిబ్బంది ఆ వాలంటీరును ఆపి విచారించారు. దీంతో రెచ్చిపోయిన వాలంటీరు ఎస్ఐను దుర్భాషలాడుతూ నానా హంగామా చేశాడు.
మహిళా ఎస్ఐ అని చూడాకుండా నడిరోడ్డుపై చొక్కా విప్పి వీరంగం సృష్టించారు. తిట్ల పురాణం అందుకుని నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. అతడికి తోడు మరో వాలంటీరు భర్త సైతం ఉన్నాడు. ఈ మేరకు వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, మరుసటి రోజే సీఐ బదిలీ కావడం చర్చనీయాంశమైంది.