నేడు ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన

by Shyam |   ( Updated:2021-02-23 21:28:27.0  )
నేడు ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. నేడు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 16 నుంచి హైద‌రా‌బాద్‌-రంగా‌రెడ్డి-మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, వరం‌గల్‌-ఖమ్మం-నల్లగొండ నియో‌జ‌క‌వ‌ర్గా‌లకు నామి‌నే‌షన్లు స్వీక‌రించారు. మొత్తం 302 నామి‌నే‌షన్లు దాఖలు అయ్యాయి.

హైద‌రా‌బాద్‌-రంగా‌రెడ్డి-మహ‌బూ‌బ్‌‌న‌గర్‌ నియో‌జ‌క‌వ‌ర్గా‌నికి మొత్తం 110 మంది 179 సెట్ల నామి‌నే‌షన్లు దాఖలు చేశారు. వరం‌గల్‌-ఖమ్మం-నల్లగొండ నియో‌జ‌క‌వ‌ర్గా‌నికి మొత్తం 78 మంది 123 నామి‌నే‌షన్లు వచ్చాయి. బుధ‌వారం నామి‌నే‌షన్ల పరి‌శీ‌లన జరు‌గు‌తుంది. అనం‌తరం నామి‌నే‌షన్ల తుది జాబి‌తాను వెల్లడి‌స్తారు. నామినేషన్ల ఉప‌సం‌హ‌ర‌ణకు ఈనెల 26వ తేదీ వరకు గడువు ఉంది. ఇర మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. అదే నెల 17న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్లు లెక్కించి, అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు.

Advertisement

Next Story

Most Viewed