ఎల్ఐసీ విక్రయానికి డెలాయిట్ సేవలు

by  |
ఎల్ఐసీ విక్రయానికి డెలాయిట్ సేవలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ (LIC) వాటా విక్రయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఎల్ఐసీ వాటా విక్రయానికి సంబంధించి ఐటీ దిగ్గజ కంపెనీ డెలాయిట్ (Deloitte), ఎస్‌బీఐ కేపిటల్ (SBI Capital) మార్కెట్స్ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎల్ఐసీ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్(LIC IPO) అంశంలో ప్రభుత్వం వేగం పెంచుతూ.. జూన్‌లో జారీ చేసినటువంటి టెండర్ల ప్రకారం.. ఎల్ఐసీ షేర్లను విక్రయించే కంపెనీలను ప్రభుత్వం త్వరలోనే ఆహ్వనించనున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆర్థిక సంస్థల అభివృద్ధి కోసం ప్రభుత్వం వివిధ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కొవిడ్-19 విపరీతంగా పెరుగుతున్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు, మునుపటి స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ప్రభుత్వ వాటాలను విక్రయించి రూ.2.10 లక్షల కోట్లను సమీకరించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా ఉన్నట్టు తెలిసిన సంగతే.


Next Story

Most Viewed