- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా ఓట్లు అడిగారని.. బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై కేసు ?
దిశ, నేషనల్ బ్యూరో : మత ప్రాతిపదికన ఓట్లు అడిగారంటూ కర్ణాటకలోని బెంగళూరు సౌత్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. మత ప్రాతిపదికన ఓట్లు అడుగుతూ ఆయన గురువారం రాత్రి ట్విట్టర్(ఎక్స్)లో ఓ వీడియోను పోస్ట్ చేశారని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెల్లడించారు. బెంగళూరు సౌత్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి తేజస్వి సూర్య పోటీ చేస్తున్నారు.
ನಾವು, ಬಿಜೆಪಿಯನ್ನು ಬೆಂಬಲಿಸುವ ಶೇ.80 ರಷ್ಟು ಜನ ಇದ್ದರೂ ಮತ ಚಲಾಯಿಸುವುದು ಕೇವಲ 20 % ರಷ್ಟು ಮಾತ್ರ.
— Tejasvi Surya (ಮೋದಿಯ ಪರಿವಾರ) (@Tejasvi_Surya) April 25, 2024
ಕಾಂಗ್ರೆಸ್ ಅನ್ನು ಬೆಂಬಲಿಸುವ ಕೇವಲ ಶೇ.20 ರಷ್ಟು ಜನರು, ಶೇ.80 ರಷ್ಟು ಮತದಾನ ಮಾಡುತ್ತಾರೆ.
ನಾವು ಹೆಚ್ಚಿನ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಮತದಾನ ಮಾಡಲೇಬೇಕಿದೆ.
ನಾಳೆ, ತಪ್ಪದೇ ನಿಮ್ಮ ಅತ್ಯಮೂಲ್ಯ ಮತ ಚಲಾಯಿಸಿ. pic.twitter.com/dMTELGLkrz
‘‘బీజేపీకి 80 శాతం మంది (మెజారిటీ వర్గం ఓటర్లు) మద్దతు ఇస్తున్నప్పటికీ.. పార్టీకి ఓట్లు వేస్తున్నది 20 శాతం మందే. కాంగ్రెస్‌కు 20 శాతం మందే (మైనారిటీ వర్గం ఓటర్లు) మద్దతు ఇస్తున్నప్పటికీ.. ఆ పార్టీకి ఓట్లు వేస్తున్నది 80 శాతం మంది’’ అని కామెంట్ చేస్తూ ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. శుక్రవారం జరిగే పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని ప్రజలకు తేజస్వి సూర్య పిలుపునిచ్చారు. బెంగుళూరు సౌత్ సీటులో కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, కాంగ్రెస్ నేత సౌమ్యారెడ్డితో సూర్య తలపడుతున్నారు. 1996 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉన్న బెంగళూరు సౌత్‌లో తేజస్వి సూర్య 2019 ఎన్నికల్లో 3 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.