- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండా.. వర్కౌట్ అవుతుందా..?
దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవకొండ రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం.. అంతగా ఆకట్టుకులేక పోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న యాక్షన్ మూవీపై ఫోకస్ పెట్టాడు విజయ్. ఇందులో విజయ్ పోలీసు క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. అయితే.. ప్రజెంట్ ఈ మూవీపై నెట్టింట ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
అసలు సినిమా ఏదైనా కానీ అందులో సాంగ్స్ ముఖ్యం. ఒక్కోసారి మూవీ హిట్ అవ్వకపోయిన సాంగ్స్ మాత్రం ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాయి. అసలు కొందరూ అయితే.. పాటల కోసమే సినిమాలు చూస్తారు. అలాంటిది విజయ్, గౌతమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై కొత్త ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఉండదట. అయితే.. ఇప్పటి వరకు విజయ్ హీరోగా వచ్చిన అన్ని సినిమాల్లో పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. సినిమా హిట్ అవ్వకపోయిన సాంగ్స్‌కు మాత్రం స్పెషల్ క్రేజ్ దక్కింది. మరి ఇప్పుడు పాటల లేకుండా సినిమా తీస్తున్నాడు అని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ‘ఇంత రిస్క్ అవసరమా’ అని కొందరు అంటుంటే.. ‘అసలు వర్కౌట్ అవుతుందా’ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.