అమరవీరులకు అవమానం! స్థూపంపైకి చెప్పులు వేసుకొని వెళ్లారని ఆరోపణలు!

by Ramesh N |   ( Updated:2024-04-27 14:39:01.0  )
అమరవీరులకు అవమానం! స్థూపంపైకి చెప్పులు వేసుకొని వెళ్లారని ఆరోపణలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమరవీరులకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు శుక్రవారం తన రాజీనామా పత్రాన్ని గన్‌పార్కులోని అమర వీరుల స్తూపం వద్ద మేధావులకు ఇచ్చి.. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ఈ సందర్భంగా గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ నాయకులు అమరులకు నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, ఇతరులు గన్ పార్కుకు వచ్చి వెళ్లిన అనంతరం కాంగ్రెస్ నాయకులతో బల్మూరి వెంకట్ అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు.

ఈ క్రమంలోనే అమరవీరుల స్థూపం పైకి చెప్పులు వేసుకొని కాంగ్రెస్ నేతలు వెళ్ళారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు అమరవీరులకు అర్పించిన పూలను చిందరవందరగా కాంగ్రెస్ నాయకులు ఊడ్చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అమరవీరుల స్థూపం వద్దకు పోయినందుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ నాయకులు కనీసం ఒక్క పువ్వు కూడా పెట్టలేదని నెటిజన్లు విమర్శలు చేశారు.

Click Here For Twitter Post..

Advertisement

Next Story