- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరోగ్యవంతులు హోంమేడ్ మాస్కులు ధరించండి: కేంద్రం
న్యూఢిల్లీ: ఆరోగ్యవంతులు హోంమేడ్ మాస్కులు ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు తప్పక మాస్కులు ధరించాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఇంటివద్ద మాస్కులు ఎలా తయారు చేయాలో.. వివరిస్తూ కొన్ని సూచనలు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆరోగ్యవంతులు హోం మేడ్ మాస్కులు ధరించాలని కోరింది. అయితే వైద్య సిబ్బంది, సిబ్బంది వెంట ఉన్నవారు.. కరోనా బాధితులతో కాంటాక్ట్ లోకి వెళ్ళినవారు లేదా ఈ మహమ్మారి సోకిన వారు ఈ మాస్క్ లను ధరించరాదని తెలిపింది. వారు ప్రత్యేకించిన ప్రొటెక్టివ్ గేర్ ఉపయోగించాలని పేర్కొంది. ఆరోగ్యవంతులు మాత్రమే హోం మేడ్ మాస్కులు ధరించాలని తెలిపింది. ప్రతి ఒక్కరు రెండు మాస్కులు కలిగి ఉండాలని… వేడినీళ్లు సబ్బుతో ఉతికి ఒక మాస్క్ ను ఆరేసినప్పుడు.. ధరించేందుకు మరో మాస్కు మెయింటెయిన్ చేయాలని తెలిపింది.
Tags: Homemade masks, Healthy people, govt, recommends