- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూ టర్న్.. పీఆర్సీ కోసం గులాబీకి సై అన్నారా..?
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యోగ సంఘాలు గులాబీ జెండాను పట్టుకున్నాయి. మొన్నటి వరకు సందిగ్ధంలో కొట్టుమిట్టాడిన ఉద్యోగ సంఘాల జేఏసీ ఒక్కసారిగా స్టాండ్ మార్చింది. మండలి పోరులో టీఆర్ఎస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించుకుంటున్నాయి. ఉద్యోగ సంఘాల కోసం టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచే డైరెక్షన్ రావడంతో, మంత్రుల రాయబారం సక్సెస్ అవుతోంది. మరోవైపు ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు రగిల్చిన పీఆర్సీ అంశాన్ని టీఆర్ఎస్ తెరపైకి తీసుకువస్తుంది. త్వరలోనే సీఎం కేసీఆర్ నుంచి ఆమోదయోగ్యమైన ప్రకటన వస్తుందంటూ మంత్రి కేటీఆర్ కూడా ప్రకటిస్తున్నారు.
ఒక్కసారిగా మారారు..
ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం చిలికి చిలికి గాలివానలా మారింది. పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు రోడ్లెక్కినా ఫలితం రాలేదు. ఇది కొనసాగుతుండగానే మండలి ఎన్నికల కోడ్ వచ్చింది. కోడ్ ఉన్నా పీఆర్సీ ఇచ్చేందుకు అవకాశాలున్నాయని, చంద్రబాబు హయాంలో ఓసారి ప్రకటించారని చెప్పుకొచ్చారు. కానీ ప్రభుత్వం తేలిగ్గానే తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు, కిందిస్థాయి ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఉపాధ్యాయ సంఘాలు కూడా మండిపడ్డాయి.
అయితే నాలుగు రోజుల కిందట వరకు సైలెంట్‌గా ఉన్న ఉద్యోగ సంఘాల జేఏసీ ఒక్కసారిగా స్టాండ్ మార్చుకుంది. జేఏసీలోని ప్రధాన భాగస్వామ్య సంఘమైన టీఎన్జీఓ, టీజీఓ ఖమ్మం సభలో మద్దతు ప్రకటించింది. శనివారం కూడా మంత్రులు గంగుల కమలాకర్, మహమూద్ అలీ టీఎన్జీఓ కేంద్ర సంఘం కార్యాలయానికి వెళ్లి చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గెలిపించి ఉద్యోగులు గెలువాలంటూ టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రకటించారు. ఆదివారం కూడా టీజీఓ భవన్లో మంత్రులు హరీష్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్‌తో కలిసి సమావేశమయ్యారు. టీజీఓల మద్దతు వాణీదేవికి ఉంటుందని, టీజీఓల సంపూర్ణ మద్దతు వాణీదేవికి ఇస్తున్నట్లు టీజీఓ ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ ప్రకటించారు.
ఏం జరిగింది…?
ఉద్యోగ సంఘాల ఏకపక్ష నిర్ణయాల వెనక ఏం జరిగిందనేది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఓవైపు పీఆర్సీపై కొన్ని ఉద్యోగ సంఘాలు ఇంకా వ్యతిరేకంగానే ఉన్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఒకటీ, రెండు చోట్లా కిందిస్థాయి ఉద్యోగులు కూడా విమర్శలకు దిగారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేరు చేస్తున్నారనే కథనాలపై మండిపడ్డారు. ఈ వ్యతిరేకత అంశం కొనసాగుతుండగానే ఉద్యోగ సంఘాలు మాత్రం యూ టర్న్ తీసుకోవడమే ఇప్పుడు చర్చగా మారింది. సంఘాలను భయ పెడుతున్నారా, బుజ్జగిస్తున్నారా అనే దానిపై ఏకంగా బెట్టింగ్‌లే మొదలయ్యాయి. మండలి పోరు తుది దశకు చేరుతున్న ఈ సమయంలో ఎందుకు ఉద్యోగ సంఘాలు స్టాండ్ మార్చుకున్నాయనేది ప్రత్యేక చర్చనీయాంశం అయింది.
ప్రమోషన్లు వచ్చినా పోస్టింగ్ల్లేవ్..?
టీజీఓ తరఫున ఆదివారం చర్చలు జరిపిన మంత్రులు హరీష్‌రావు, కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్‌తో మద్దతు ఉంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీజీఓ పదోన్నతులు, ఉద్యోగాలపై ప్రకటన చేసింది. ఒకే నెలలో 32 వేల ప్రమోషన్లు ఇచ్చినట్లు టీజీఓ వెల్లడించింది. వాస్తవంగా చాలా శాఖల్లో పదోన్నతులు ఇచ్చినా ఇప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతిలో ఉన్న అబ్కారీ శాఖలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిటెండెంట్ల నుంచి ఎక్సైజ్ సూపరింటెండ్లుగా కొంతమందికి పదోన్నతులు కల్పించారు. మూడు నెలల కిందటే పదోన్నతులిచ్చినట్లు ఉత్తర్వులిచ్చారు. కానీ ఇప్పటి వరకూ పోస్టింగ్‌లు లేవు. దీంతో నాలుగైదు నెలల సర్వీసును వెనకబడుతామని పదోన్నతులు పొందిన అధికారులు మొత్తుకుంటున్నా పక్కన పెట్టారు. వాణిజ్య పన్నుల శాఖలో కూడా అదే పరిస్థితి. చాలా శాఖల్లో పోస్టింగ్‌లను పక్కన పెట్టారు. టీజీఓ నుంచి పదోన్నతులపై ప్రకటనలు చేయడంపై కొన్ని సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.