ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ల అభివృద్ధికి ప్రతిపాదనలు

by Harish |
ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ల అభివృద్ధికి ప్రతిపాదనలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రధాన రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వే (express way)లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించి, నిర్వహణ కొనసాగించాలనుకునే సంస్థల నుంచి ఛార్జింగ్ స్టేషన్ల (station) ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ యాజమాన్యంలోని డిస్కమ్ (discum) సహా ప్రైవేట్ సంస్థల నుంచి ప్రభుత్వ ఎలక్ట్రిక్ వాహనాల (Electronic vechicles)ఛార్జింగ్ మౌలిక సదుపాయాల నిర్మాణం, నిర్వహణకు ఆహ్వానిస్తున్నట్టు భారీ పరిశ్రమల విభాగం వెల్లడించింది.

ప్రధానంగా హైదరాబాద్ ఓఆర్ఆర్ (ORR)ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-పూణె, ఢిల్లీ-ఆగ్రా, బెంగళూరు-చెన్నై సహా పలు నగరాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను ప్రభుత్వం ఆశిస్తోంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యూఫక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ (FAME) ఇండియా పథకం రెండో దశ కింద ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలకు మూలధన నిధులను మంజూరు చేయడం ద్వారా ఈవీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2019, ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూడేళ్ల వరకు ఫేమ్ ఇండియా పథకం రెండో దశను కేంద్రం ఆమోదించింది. ఈ పథకం ద్వారా ప్రజా రవాణాలో విద్యుదీకరణ పెంచడం ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed