- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తలైవా ఆరోగ్యంపై గవర్నర్ ఆరా
దిశ,వెబ్‌డెస్క్: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. అపోలో వైద్యులకు ఆమె ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రజినీకాంత్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా తలైవా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఆయన ఆరోగ్య విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఈరోజు రాత్రి ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని వైద్యులు తెలిపారు. శనివారం ఉదయం రజినీని డిశ్చార్జ్ చేస్తారని వెల్లడించారు. ఇంటర్నేషనల్ సూట్‌లోని ఒక ప్రత్యేక గదిలో రజినీకి వైద్య సేవలు అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో రజినీ సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. కూతురు ఐశ్వర్యను కూడా రూం దగ్గరకు రావద్దని రజినీ చెప్పారని వైద్యులు తెలిపారు.