- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌తో లాలూచీ లేదు.. ఘర్షణ కూడా లేదు : తమిళిసై
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ఎలాంటి ఘర్షణ గానీ, లాలూచీ గానీ లేదని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాల విషయంలో జోక్యం చేసుకోవడం తన అభిమతం కాదని, కానీ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో మాత్రం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి లేఖల ద్వారానో, సమావేశాల సందర్భంగానో చెప్తూనే ఉంటానని అన్నారు. తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన తర్వాత ఏడాది కాలంలో ఆమె పాల్గొన్న కార్యక్రమాలు, తీసుకున్న చొరవ, చేపట్టిన కార్యాచరణ తదితరాలను ‘మూవింగ్ ఫార్వార్డ్ విత్ మెమొరీస్ ఆఫ్ మెయిడెన్ ఇయర్’ పుస్తకం రూపంలోకి మల్చారు. దీన్ని రాజ్‌భవన్‌లో శుక్రవారం ఆవిష్కరించిన సందర్భంగా ఆమెపై విధంగా పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి చెప్పాలనుకున్న విషయాలు కఠినంగా ఉన్నా తనకున్న కమ్యూనికేషన్ టాలెంట్‌తో వాటిని స్వీకరించే తీరులో వ్యక్తం చేస్తూ ఉంటానన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, తన జన్మదినం జూన్ 2వ తేదీ కావడం యాధృచ్ఛికమైనా తెలంగాణతో ఆ రూపంలో విడదీయరాని బంధం ఉంటుందన్నారు.
త్వరలో ప్రజా దర్బార్..
గవర్నర్‌గా తాను కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిగా ఎలా ఉంటానో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విషయంలోనూ అలానే వ్యవహరిస్తానని తమిళిసై అన్నారు. కరోనా కారణంగా చాలా రకాల కార్యక్రమాలకు విఘాతం కలిగిందని, ప్రజల మధ్యకు, గిరిజన ప్రాంతాలకు వెళ్లాలనుకున్న తన ఆలోచనలు సాకారం కాలేదని పర్కొ్నారు. త్వరలోనే ప్రజలు రాజ్‌భవన్‌కు స్వేచ్ఛగా వచ్చి వారి సమస్యలను, అభిప్రాయాలను తెలియజేసేందుకు వీలుగా ‘ప్రజా దర్బార్’ విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.
త్వరలో గిరిజన అన్న యోజన
మారుమూల గిరిజన ప్రాంతాల్లో పౌష్ఠికాహారానికి నోచుకోలేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, అలాంటివారికి నేరుగా ఆ ప్రాంతాల్లోనే ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో త్వరలోనే గిరిజన అన్న యోజన పథకాన్ని అమలుచేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తొలి అడుగులు పడినా కరోనా కారణంగా పూర్తిస్థాయికి చేరుకోలేదన్నారు. గిరిజనులకే శిక్షణ ఇచ్చి వారి ద్వారానే సంఘాలను ఏర్పాటు చేయించి పౌష్ఠికాహారాన్ని వారి ద్వారానే గిరిజన ప్రాంతాలకు చేరవేసి నిరంతరం ఇది అమలయ్యే వ్యవస్థను నెలకొల్పతున్నట్లు తెలిపారు.
తెలంగాణలో మహిళా సాధికారత
తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత సాకారమవుతోందని అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ మేయర్, ఉపమేయర్‌లుగా మహిళలే ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. మనం ఎన్నడూ అనుభవించని ఇబ్బందులను కరోనా సమయంలో చూశామని, టీకా హైదరాబాద్ నుంచే తొలుత వస్తుందని తాను అంచనా వేసినట్లుగానే భారత్ బయోటెక్ నుంచి కొవాగ్జిన్ వచ్చిందని గవర్నర్ గుర్తుచేశారు. తాను, తన భర్త వైద్యులుగా ఇప్పుడు హెల్త్ కేర్ వర్కర్ కోటాలో టీకా తీసుకునే వెసులుబాటు ఉందని, కానీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చినప్పుడే తీసుకోవాలని ఇప్పుడు వాయిదా వేసుకున్నామని తెలిపారు.